దీపావ‌ళిని త‌ల‌పిస్తున్న మార్కెట్లు

యూపీ: క‌రోనా మ‌హ‌మ్మారిపై ప్ర‌భుత్వాలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా.. ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు లైట్లు ఆపేసి, దేశ ప్ర‌జ‌లంతా దీపాలు, టార్చ్ లైట్లు, స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ లైట్ల‌ను వెలిగించాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా దీపావ‌ళి శోభ సంత‌రించుకున్న‌ట్లుగా అనిపిస్తోంది.

యూపీలోని మొరాదాబాద్ తోపాటు వివిధ ప్రాంతాల్లో దీపం వెలిగించేందుకు అవ‌స‌ర‌మైన మ‌ట్టి దీపాంత‌లు కొనుగోలు చేస్తున్నారు. రోడ్ల‌పై అక్క‌డ‌క్క‌డా చిరు వ్యాపారులు వివిధ ఆకృతుల్లో మ‌ట్టి దీపాంత‌లు త‌యారు చేసి అమ్ముతున్నారు. లాక్ డౌన్ అమ‌లు ఉండ‌టంతో జ‌నాలంతా ఇండ్ల‌లోనే రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారాయి. అయితే ఇవాళ మాత్రం దీపాంత‌లు కొనుగోలు చేసేవారితో రోడ్లు, వీధులు కాస్త కిట‌కిట‌లాడుతున్నాయి.

Latest Updates