ఇరాన్ లో భూకంపం

ఇరాన్ దేశం సౌత్ వెస్ట్ ఏరియాలో భూకంపం వచ్చింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఖుజేస్తాన్ లోని సోలేమన్ మసీద్ దగ్గర భూమికి 17 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో వచ్చింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్టుగా సమాచారం అందలేదని అధికారులు చెప్పారు. భూకంప ప్రభావం ఏంటనేదానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

Latest Updates