అండమాన్‌ నికోబార్ లో భూకంపం

అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపంలో ఇవాళ ( బుధవారం) తెల్లవారు జామున 1.51 గంటలో సమయంలో ఈ సంఘటన జరిగింది. అండమాన్‌ ద్వీపంలో 10 కిలోమీటర్ల లోతున ఏర్పడిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.5గా నమోదయ్యింది. దీంతోపాటు చెన్నై, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. బంగాళఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన ఈ భూకంపం తో ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం కలగలేదని అధికారులు చెప్పారు.

Latest Updates