హ్యాకర్లకు ఆండ్రాయిడే ఈజీ 

హైదరాబాద్, వెలుగుచాలా తేలికగా ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌‌లు సైబర్ క్రిమినల్స్‌‌ బారిన పడుతున్నాయని కే7 కంప్యూటింగ్ సైబర్ రిస్క్ మానిటర్(సీఆర్‌‌‌‌ఎం) రిపోర్ట్ వెల్లడించింది. మొబైల్ సెక్యురిటీ స్పేస్‌‌లో హానికరమైన యాప్స్‌‌ ను వాడుకుని సైబర్ క్రిమినల్స్‌‌ మొబైల్ డివైజ్‌‌లపై అటాక్ చేస్తున్నట్టు తెలిపింది. చిన్న మధ్య స్థాయి బిజినెస్‌‌లు, వ్యాపారాలను కూడా సైబర్‌‌‌‌ క్రిమినల్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని కే7 కంప్యూటింగ్ థ్రెట్ కంట్రోల్ ల్యాబ్ వైస్‌‌ ప్రెసిడెంట్ సమీర్ మోడీ తెలిపారు.  సర్వర్ కాన్ఫిగరేషన్స్‌‌ బలహీనంగా ఉండటంతో సంస్థలపై సైబర్ అటాక్స్ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. 51 శాతం అటాక్స్‌‌ వెబ్ లేదా ఆన్‌‌లైన్ ఆధారంగానే     జరుగుతున్నట్టు చెప్పారు. పాస్‌‌వర్డ్‌‌లు బలహీనంగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని, స్ట్రాంగ్ పాస్‌‌వర్డ్‌‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇన్‌‌సెక్యూర్ వెబ్‌‌సైట్లు, యూఆర్‌‌‌‌ఎల్స్ ద్వారా కూడా వెబ్ ఆధారిత అటాక్స్ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా సైబర్‌‌‌‌ క్రిమినల్స్ చాలా స్మార్ట్‌‌గా అయ్యారని మోడీ చెప్పారు.

సర్వర్లు బలహీనంగా ఉండటంతో సంస్థలు కూడా సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్నట్టు తెలిపారు. 27 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కే7 కంప్యూటింగ్‌‌ దేశంలోనే తొలి సైబర్ సెక్యురిటీ కంపెనీ అని సీఈవో  పురుషోత్తమన్  కే అన్నారు. ప్రతి క్వార్టర్‌‌‌‌లో కూడా తాము రెగ్యులర్‌‌‌‌గా సీఆర్‌‌‌‌ఎం రిపోర్ట్‌‌ను విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమకు 2.5 కోట్ల మంది జర్లున్నారని,వారిలో ఇండియా నుంచి కోటి మంది ఉన్నట్టు పేర్కొన్నారు. ఇండియా మార్కెట్ షేరు 23 శాతం ఉన్నట్టు చెప్పారు. కే 7 కంప్యూటింగ్ టర్నోవర్ ప్రస్తుతం రూ.74 కోట్లు ఉందని, ఈ టర్నోవర్ రూ.100 కోట్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పురుషోత్తమన్ వెల్లడించారు.  సైబర్ అటాక్స్ బారిన పడిన 86 శాతం మంది ఇండియన్ యూజర్లు కూడా ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ మోస్ట్ సెక్యూర్ ఓఎస్ విండోస్ 10ను వాడటం లేదని ఈ రిపోర్ట్ గుర్తించింది. విండోస్ 10లోకి మారాలని రిపోర్ట్ సూచించింది.

Latest Updates