16న జైట్లీ, జెఠ్మలానీ సీట్లకు ఉప ఎన్నిక

న్యూఢిల్లీ: రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. బీహార్, యూపీల్లో ఇటీవల ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 16న ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికకు శుక్రవారం (సెప్టెంబరు 27) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనుంది. అక్టోబరు 16న ఎన్నిక నిర్వహించి, ఫలితాన్ని వెల్లడిస్తుంది.

కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, రామ్ జెఠ్మలానీల మరణంతో వారు ప్రాతినిద్యం వహించిన స్థానాలకు ఈ ఉప ఎన్నిక వచ్చింది. అరుణ్ జైట్లీ ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున, రాం జెఠ్మలానీ బీహార్ నుంచి ఆర్డేడీ తరఫున రాజ్యసభ ఎంపీలుగా ఉండేవారు.

ఆగస్టు 24న మరణించిన జైట్లీ రాజ్యసభ సభ్యత్వం గడువు 2024 ఏప్రిల్ 2 వరకు ఉంది.

సెప్టెంబరు 9న మరణించిన జెఠ్మలానీ సభ్యత్వం గడువు 2022 జూలై 7 వరకు ఉంది.

Latest Updates