ఈసీ విధుల్లో జోక్యం చేసుకోలేం: ఏపీ హైకోర్టు

ఐపీఎస్‌ అధికారుల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఇంటలిజెన్స్‌ డీజీ ఏబీ వెంటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ వర్మలను ఈసీ బదిలీ చేయడంపై అభ్యం తరం తెలుపుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి.ఈసీ విధుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకచింది. ఇంటలిజెన్స్‌ డీజీ బదిలీపై స్టే ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వం అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పునేపథ్యం లో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై ఏపీ సీఎంచంద్రబాబు న్యాయ నిపుణులతో చర్చించారు.

 

Latest Updates