వీడిన సస్పెన్స్: నిజామాబాద్‌లో ఈవీఎంలతోనే పోలింగ్‌

నిజామాబాద్ లోక్ సభ ఎన్నిక నిర్వహణపై సస్పెన్స్ వీడింది. ఈవీఎంల ద్వారానే.. పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణకు.. ఏర్పాట్లు చేసుకోవాలని సీఈవోకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనికి తగినట్లుగా.. 26 వేల 820 బ్యాలెట్ యూనిట్లు, 2 వేల 240 కంట్రోల్ యూనిట్లు, 2 వేల 6 వందల వీవీ ప్యాట్ లు సరఫరా చేయాలని ఈసీఐఎల్ కు ఆదేశాలిచ్చింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో 185 మంది పోటీ చేస్తున్నారు.

Latest Updates