రెండు ఎంపీటీసీ స్థానాలకు రీపోలింగ్

EC decided to conduct re polling in two MPTC seats in Telangana state

రాష్ట్రంలో జరిగిన తొలివిడత పరిషత్ ఎన్నికల్లో.. రెండు ఎంపీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్, సిద్దిపేట జిల్లా మీర్ దొడ్డి మండలం అల్వాల్ స్థానాలకు ఈ నెల 14 న మూడో దశలో ఈ ఎన్నికలు నిర్వహించేలా.. ఆయా జిల్లాల కలెక్టర్ల నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది

బ్యాలెట్ పేపర్లు తారుమారైన కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రీ పోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ లో పాల్గొనే ఓటర్లకు ఎడమ చేయి ఉంగరపు వేలు కు ఇంక్ మార్క్  పెట్టాలని కమిషనర్ నాగిరెడ్డి సిబ్బందిని ఆదేశించారు.

Latest Updates