డౌట్స్ వద్దు : ఈవీఎంలపై ఢిల్లీలో ఈసీ క్లారిటీ

ఈవీఎంలపై విపక్షాలు ఆరోపణలు తీవ్రం చేయడంతో ఎన్నికల సంఘం అనుమానాలు క్లారిఫై చేసింది. ఇవాళ ఢిల్లీలో ఈవీఎం, వీవీపాట్ యంత్రాలపై అపోహలను తొలగించేందుకు ప్రయత్నించారు అధికారులు. ఓటు వేయడం, వీవీపాట్ లో ప్రింట్ రావడం, బీప్ సౌండ్, ఇలా అన్ని అంశాలను వివరించారు.

ఈవీఎం మిషన్ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ ను ఎవరూ మార్చలేరని అన్నారు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్. ఫ్యాక్టరీ నుంచి రాగానే సురక్షితంగా తరలించి భద్రపరుస్తారని, వీటిని బయటి నుంచి హ్యాక్ చేసే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు. ఇన్ పుట్ తీసుకునే సిస్టమ్ ఈవీఎంలో ఏదీ లేదన్నారు.

ఇప్పటివరకు 250కోట్ల ఓట్లను రికార్డ్ చేశామనీ.. అందులో ఒక్కటి కూడా తప్పుగా నమోదు కాలేదని వివరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు 16 లక్షల కంట్రోల్ యూనిట్లు, 22లక్షల బ్యాలెట్ యూనిట్లు, 17 లక్షల వీవీ ప్యాట్లు వాడుతున్నామన్నారు. వీటిలో 96శాతం మెషీన్లకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తయిందన్నారు.

Latest Updates