అమిత్ షాపై రాహుల్ కామెంట్ : కొట్టిపారేసిన ఈసీ

ఢిల్లీ: కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. BJP జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ చేసిన కామెంట్స్ పై క్లిన్ చిట్ జారీ చేసినట్లు తెలిపింది. ‘ అమిత్ షా హత్య కేసులో నిందితుడు’ అంటూ రాహుల్ గాంధీ చేసిన  కామెంట్ ను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించలేదు. అది ఎన్నికల ప్రవర్తనా కోడ్ ఉల్లంఘన కిందికి రాదంటూ గురువారం క్లీన్‌చిట్ ఇచ్చింది. అమిత్ షా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ హత్య కేసును ఉద్దేశించి ఎన్నికల ప్రచారంలో రాహుల్ విమర్శలు చేశారు. అయితే ఆ కేసు నుంచి  నుంచి ఐదు సంవత్సరాల క్రితమే షా నిర్దోషిగా బయటపడ్డారు.

‘హత్య కేసులో నిందితుడైన BJP జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎంత గ్రాండ్‌గా ఉన్నారు. మీరు ఎప్పుడైన జయ్‌ షా పేరు విన్నారా? ఆయన ఒక ఇంద్రజాలికుడు. ఆయన రూ.50,000ను మూడు నెలల్లో రూ.80 కోట్లు చేశారు’ అని ఓ ఎన్నికల ర్యాలీలో అమిత్‌ షాను ఉద్దేశించి రాహుల్ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు.

Latest Updates