కేంద్రం కనుసన్నల్లో EC: చంద్రబాబు

ఆర్థిక నేరస్థులు ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగమేఘాల మీద చర్యలు తీసుకుని పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేయడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల విధులతోసంబంధం లేని ఏపీ ఐబీ చీఫ్‌ ను బదిలీ చేయడమేంటని ప్రశ్నిం చారు. కేంద్ రం కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని, రాజకీయ కుట్రలో పావుగా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీతో జగన్‌‌‌‌‌‌‌‌ కలిశారనడానికి ఈసీ పనితీరే నిదర్శనమన్నా రు. బుధవారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.‘ఎన్నికల్లో వైసీపీ చేస్తున్న అక్రమాలపై మేం నిజాయితీగా ఫిర్యాదు చేస్తే కనీస స్పందన కూడా ఉండదు. కానీ ఆర్థిక నేరగాళ్ల పార్టీ ఫిర్యాదును తీసుకొని కనీసం విచారణ కూడా జరపకుండా ఈసీ 24 గంటల్లో నే ఐబీ చీఫ్‌ , కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేయడం దారుణం. ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఈసీ ఏకపక్షంగా బదిలీ చేసింది. వారిని ఏ కారణంతో బదిలీ చేస్తున్నారన్న సమాచారం కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదు. వైసీపీ తరఫున ఆర్థిక నేరస్థుడైన విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై.. అధికారుల వివరణ కోరకుండా, న్యా యాన్ని పాటించకుండా ఈ బదిలీ చేసింది. వాళ్ల క్రిమినల్ ఆలోచనలకు ఈసీ తోడైంది. ఈసీ ఆదేశాలను ఖండిస్తున్నా . ప్రజాస్వామ్యబద్ధం గా ఎన్నికలు జరపాల్సిన ఈసీ.. అధికారులను కక్ష్యపూరితంగా బదిలీ చేయడం ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యం చేయడమే. కారణం చూపకుండా బదిలీ చేయడం రాజ్యాంగ విరుద్ధం . ఈసీ మోడీ నియంత్రణలోకి వెళ్లినట్లు కనిపి స్తోంది. వైసీపీ నాయకులు బీజేపీ సాయంతో గంట గంటకు ఈసీ అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నా రు. అదే టీడీపీ నాయకులు ఫిర్యాదుచేయడానికి వెళ్తే రోజుల తరబడి నిరీ క్షించేలా చేస్తున్నారు” అని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ఫిర్యాదులను పట్టించుకోలేదేం?…

వైసీపీ, బీజేపీ రాజకీయ కుట్రలో ఈసీ పావుగామారడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని బాబు అన్నా రు.‘తెలంగాణలో ఎన్నికలప్పుడు ఈసీకి కాంగ్రెస్ ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టిం చుకోకుండా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఏపీలో బీజేపీకి బానిసగా మారిన వైసీపీ చేస్తున్న ఫిర్యాదులపై మాత్రం స్పందిస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యానికి ఘాతం కలిగించాయి. నిజాయితీని దండిం చి నేరస్థులను ప్రోత్సహించడమే ఈసీ పనిగా పెట్టుకుం దా’ అని ప్రశ్నిం చారు. అందుకే కడప ఎస్పీ ని బదిలీ చేశారు. వివేకానందరెడ్డిని సొంతిం ట్లో దారుణంగా హత్య చేసి ఎవరికీ తెలియకుం డా ముఖానికి తలకు గుడ్డలు కట్టేసి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని జగన్‌‌‌‌‌‌‌‌పై చంద్రబాబు విమర్శలు చేశారు. హత్యకు సంబంధిం చిన ఆధారాలను తుడిచేశారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు నెపంతో తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతోనే కడప ఎస్పీని బదిలీ చేశారన్నా రు.

ఒక్కరోజులోనే బదిలీ చేస్తారా?….

ఈసీ నిస్పక్షపాతంగా వ్యవహరించడం లేదనేందుకు మరో ఉదాహరణ శ్రీకాకుళం కలెక్టర్ బదిలీయేనని చంద్రబాబు అన్నా రు. కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ఆయన్ను ఒక్క రోజులోనే బదిలీ చేయించిం దన్నారు.‘ఎరుకల కులం నుంచి వచ్చిన తొలి ఐఏఎస్ అధికారిని ఏ కారణం చూపకుండా బదిలీ చేశారు. శ్రీకాకుళం ఎస్పీ కాపు కులస్తుడు. ఆయనను కూడా ఎలాంటి కారణం చూపకుండా బదిలీ చేశారు.వైసీపీ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కులాల ప్రస్తావన ఉన్న విషయం అధికారులను మనోవేదనకు గురిచేసింది. అందుకే ఈ విషయాన్ని ప్రజలకు చెబుతున్నా .కాపులకు రిజర్వేషన్లు వ్యతిరేకిం చిన వైసీపీ ఇప్పుడు కాపు అధికారులపై కూడా ఫిర్యాదులు చేసి వారి మనో నిబ్బరాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.

 

Latest Updates