నోట్ల కట్టలు ఎగురుతున్నయా?

EC officials checks in Modi, Nirmala seetharaman , kumara swamy’s helicopters
  • ఆకాశమార్గంలో ఎన్నికల అక్రమాలపై ఈసీ నజర్
  • కర్ణాటక సీఎం కుమార, రక్షణ మంత్రి నిర్మల హెలికాప్టర్లలో తనిఖీలు
  • తమిళనాట ఐటీ దాడులు
  • ఏకపక్షమంటూ డీ ఎంకే, కాంగ్రెస్ ఆగ్రహం

రెండో దశ పోలింగ్ సందర్భంగా అక్రమాల నివారణకు ఎన్నికల సంఘం భారీ కసరత్తు చేస్తున్నది. ఒక దిక్కు అనుమానిత నేతల ఇండ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులతో కలిసి దాడులు చేస్తూనే, మరోవైపు ఆకాశయానాలపైనా దృష్టి సారించింది. మంగళ,బుధవారాల్లో పలువురు వీవీఐపీల హెలికాప్టర్లలో ఈసీ అధికారులు సోదాలు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం బుధవారం శివమొగ్గ వెళ్లిన కర్ణాటక సీఎం కుమారస్వామిని ఎన్నికల అధికారులు హెలీప్యాడ్ వద్దే నిలిపేసి, లగేజిని, చాపర్ లో పలి భాగాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసింది. రాయ్ చూర్ లో మాజీ సీఎం యడ్యూరప్ప హెలికాప్టర్ నూ చెక్ చేశారు. రూ ర్కేలాలో ఎన్నికల సభలో పాల్గొనేందుకు వచ్చిన బీజేడీ చీఫ్ , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఉత్తరాఖండ్ లో  పర్యటించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హెలికాప్టర్లలో నూ సోదాలు చేశారు. ఏఐఎన్ఆర్సీ పార్టీ చీఫ్ , పుదుచ్చేరి మాజీ సీఎం రంగస్వామి చాపర్ ను కూడా పరిశీలించారు. కాగా, ఈసీ ఏకపక్షంగా దాడులు చేస్తున్నదంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి . రెండో దశ ఎన్నికల్లో భాగంగా 95 లోక్ సభస్థానాలు, ఒడిశాలోని 35 అసెంబ్లీ సీట్లు, తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్  గురువారం  జరగనుంది.

వాళ్లపై టిప్​ అందట్లేదా ?: చిదంబరం

పోలింగ్ కు ఒక రోజుముందు తమిళనాడులో ఐటీ,ఈసీ అధికారు ల జాయిట్ సోదాలు రాజకీయ రచ్చకు దారితీశాయి. మోడీ ఆదేశాల మేరకు ఐటీ, ఈసీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయిని, ప్రతిపక్ష నేతల ఇండ్లు , ఆఫీసుల్లో మాత్రమే దాడులు చేస్తున్నారని తూత్తుకుడి డీ ఎంకే అభ్యర్థి కనిమొళి మండిపడ్డారు. మంగళవారం రాత్రి ఆమె ఇంట్లో సోదాలు చేసిన అధికారులకు ఏమీ దొరకలేదన్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఘాటుగా స్పందిం చారు. ‘‘అదేంటో మరి, ఐటీ,ఈసీ ఆఫీసర్లకు ఒకవైపు నుంచే టిప్ (సమాచారం) వెళుతోంది. 2019 తమిళనాడు లో క్ సభ ఎన్నికలు ఐటీ శాఖ నిరంకుశత్వానికి, ఏకపక్ష చర్యలకు నిదర్శనంగా నిలుస్తాయి ’’అని చిదంబరం పేర్కొన్నారు.

మోడీ హెలికాప్టర్​లో తనిఖీ.. అధికారి సస్పెన్షన్

భువనేశ్వర్​: వీవీఐపీల వాహనాలను ఎడాపెడా తనిఖీచేస్తున్న ఎన్నికల సంఘం, ప్రధాని మోడీ హెలికాప్టర్ ను  చెక్ చేసిన అధికారిని మాత్రం సస్పెండ్ చేసింది. మంగళవారం ఒడిశాలోని సంభాల్ పూర్ లో మోడీ పర్యటించిన సందర్భంలో ఆయన హెలికాప్టర్ ను మొహ్మద్ మోసిన్ అనే ఐఏఎస్ అధికారి తనిఖీచేశారు. ఎస్పీజీ భద్రతలో ఉన్న వ్యక్తుల వాహనాలను తనిఖీ చేసే అధికారం ఈసీకి లేదు. ఇది తెలిసి కూడా మోసిన్ హద్దు మీరారన్న కారణంతో ఈసీ ఆయనపై వేటేసింది.

Latest Updates