‘రైతు బంధు’కు ఈసీ గ్రీన్ సిగ్నల్.. నేరుగా అకౌంట్లలోకే పంటసాయం..

ఢిల్లీ : ‘రైతుబంధు’ పంట సాయానికి షరతులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. రైతులకు నేరుగా చెక్కులు కాకుండా… వారి బ్యాంక్ అకౌంట్లలో చెక్కులు వేసి రైతు బంధు స్కీమ్ అమలు చేయాలని సూచించింది. ఈ పథకం ఇప్పటికే అమలులో ఉన్నందున… కోడ్ వర్తించదని క్లారిటీ ఇచ్చింది. కొన్ని మార్గదర్శకాలు అనుసరిస్తూ… రెండో విడత చెక్కుల పంపిణీ చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కొత్త రైతులకు రెండో విడతలో రైతు బంధు చెక్కులు ఇవ్వొద్దని సూచించింది వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పంపిన లెటర్ కు… సీఈసీ రిప్లై ఇచ్చింది.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జిల్లాలకు చేరిన చెక్కులను… వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు నేరుగా పంపిణీ చేయించొద్దని కలెక్టర్లకు సూచన ఇచ్చింది. రైతు ఖాతాల్లోకి నేరుగా రెండో విడత ‘రైతు బంధు’ పంట సాయం జమ చేయాల్సి ఉందని కలెక్టర్లకు ప్రభుత్వం తెలిపింది. బ్యాంకుల సహకారంతో రైతు బంధును సక్సెస్ చేయాలని కిందిస్థాయి అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates