రాహుల్ నామినేషన్ పరిశీలన వాయిదా

అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్ స్క్రూటినీని 22కు వాయిదా వేశారు రిటర్నింగ్ ఆఫీసర్. అమేథీలో ఇండిపెండెంట్ గా  పోటీ చేస్తున్న ధృవ్ లాల్ అనే అభ్యర్థి.. రాహుల్ గాంధీ జాతీయతపై అభ్యంతరం తెలిపారు. బ్రిటన్ లో రిజిస్టర్ అయిన ఓ కంపెనీలో రాహుల్ తాను యూకే సిటిజెన్ గా పేర్కొన్నారని రిటర్నింగ్ అధికారికి తెలిపారు. దీంతో నామినేషన్ పరిశీలనను 22కు వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి. స్వతంత్ర్య అభ్యర్థి లేవనెత్తిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ లాయర్ దగ్గర సమాధానం లేదని బీజేపీ ఆరోపించింది.

Latest Updates