మున్సిపోల్స్‌కు రిజర్వేషన్లు విడుదల

పురపాలక ఎలక్షన్లకు సంబంధించి మొదటి దశ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఆయా వర్గాల వారీగా వార్డు పదవుల రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లను కేటాయించారు. ఎస్టీల జనాభా ఒక శాతానికి తక్కువగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లో ఒక వార్డును ఎస్టీలకు రిజర్వ్
చేశారు. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించింది. వార్డుల వారీ రిజర్వేషన్లు రేపు ఖరారు కానున్నాయి.

కార్పొరేషన్లలో రిజర్వేషన్లు

కరీంనగర్ – 60: ఎస్టీ -1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 3, బీసీ – 12, బీసీ మహిళ – 11, జనరల్ మహిళ – 16, జనరల్ – 14

రామగుండం – 36: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 2, ఎస్సీ మహిళ – 2, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 10, జనరల్ – 8

బడంగ్ పేట – 32: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 2, బీసీ – 5, బీసీ మహిళ – 5, జనరల్ మహిళ – 9, జనరల్ – 7

మీర్ పేట – 46: ఎస్టీ – 2, ఎస్టీ మహిళ – 1, ఎస్సీ -4, ఎస్సీ మహిళ -3, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 13, జనరల్ – 10

బండ్లగూడ జాగీర్- 22 : ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ -2, ఎస్సీ మహిళ – 1, బీసీ – 4, బీసీ మహిళ – 3, జనరల్ మహిళ – 7, జనరల్ – 4

బోడుప్పల్ – 28: ఎస్టీ -1, ఎస్టీ మహిళ -0, ఎస్సీ -2, ఎస్సీ మహిళ -1, బీసీ -5, బీసీ మహిళ -5, జనరల్ మహిళ -8, జనరల్ – 6

ఫీర్జాదిగూడ – 26: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 1, ఎస్సీ మహిళ – 1, బీసీ – 5, బీసీ మహిళ – 5, జనరల్ మహిళ – 7, జనరల్ – 6

జవహర్‌నగర్‌ – 28: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 2, బీసీ – 4, బీసీ మహిళ – 4, జనరల్ మహిళ – 8, జనరల్ – 6

నిజాంపేట – 33: ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 1, ఎస్సీ మహిళ – 1, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 9, జనరల్ – 8

మున్సిపాలిటీ రిజర్వేషన్లు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 141 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో 128 మున్సిపాలిటీలు కాగా మరో 13 మున్సిపల్ కార్పోరేషన్‌లు‌గా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు 120 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. 8 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు లేవు. మరో  5 మున్సిపాలిటీలకు ఇంకా పదవీకాలం పూర్తవలేదు. వాటిలో జహీరాబాద్, మణుగూరు, పాల్వంచ, సిద్దిపేట, మందమర్రి ఉన్నాయి. కాగా.. రిజర్వేషన్ల వల్ల జడ్చర్ల, నకిరేకల్, అచ్చంపేట కార్పొరేషన్లకు సంబంధించి కేసు కోర్టులో ఉంది. కార్పొరేషన్లకు సంబంధించి.. మొత్తం 13 కార్పొరేషన్లలో మూడు కార్పొరేషన్లకు ప్రస్తుతం ఎన్నికలు లేవు. వాటిలో జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం ఉన్నాయి. వీటికి ఇంకా పదవీకాలం పూర్తి కాలేదు. కాగా మిగిలిన 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో కరీంనగర్, రామగుండం, బడంగ్ పేట, మీర్ పేట, బండ్లగూడ జాగీర్, బొడుప్పల్, ఫీర్జదిగూడ, జవహర్ నగర్, నిజాం పేట, నిజామాబాద్ ఉన్నాయి.

Latest Updates