బంగారమే..బంగారం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో వాహనాల తనిఖీలను ఈసీ వేగవంతం చేసింది. తమిళనాడులో మంగళవారం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో 31 కిలోల బంగారం పట్టుబడింది. మధురై లో 18 కిలోలు, చెన్నైలో 13 కిలోలు, కరూర్ లో 10 కిలోల బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.14 కోట్లు ఉంటుందని అంచనా. బంగారు నగలు తరలిస్తున్నవారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఏపీలో 60 డైమండ్స్ కూడా.. ఏపీలోని చిత్తూరు జిల్లాలో 11కిలోల బంగారం, 60 డైమండ్లు పట్టుబడ్డాయి. మంగళవారం జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని పల్లిపట్టు చెక్ పోస్ట్ దగ్గర నోడల్ అధికారులు, పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వీటిని గుర్తించారు. బంగారం, వజ్రాలు తరలిస్తున్నవారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Latest Updates