చంద్రబాబుకు EC షాక్ : అధికారిక రివ్యూలపై నోటీసులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం మరో షాక్‌ ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే సీఎం హోదాలో ఆయన సమీక్షలు నిర్వహించడంపై CEO గోపాలకృష్ణ ద్వివేది తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నిర్వహించిన సమీక్షలపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి LV సుబ్రహ్మణ్యంను కోరారు.

CEO ఆఫీస్ నుంచి గురువారం నాడే CSకు లేఖ వెళ్లింది. చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి హాజరైన అధికారులపైనా చర్యలు తీసుకునే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అదే సమయంలో బాబు సమీక్షలు నిర్వహించిన తీరును, ఆ సందర్భంగా ఎన్నికల నిబంధనావళిపై చేసిన కామెంట్లను CEO కార్యా లయం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల అధికారుల స్పందన తెలియడంతో… నిర్వహించాల్సిన ఒక సమీక్షను బాబు రద్దు చేసుకున్నారు.

ఎన్నికల కోడ్‌లో ఈ అంశానికి సంబంధించి ఉన్న నిబంధనల ప్రకారం అత్యవసర అంశాలపై చర్చించేందుకు కోడ్‌ పెద్దగా అడ్డురాదు. అయితే ఇతర అంశాలను సమీక్షించకూడదు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లోని 19.6, 19.6.1 నిబంధనల ప్రకారం సీఎంతో సహా ఇతర మంత్రులు టెలీకాన్ఫరెన్స్‌, సమీక్షలు, ఇతర ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదని స్పష్టంగా ఉంది. ఒకవేళ అత్యవసరమైతే Ec అనుమతి తీసుకోవాలి. దానికి కూడా సమయం లేకపోతే వీడియోలో రికార్డు చేసి ఎన్నికల అధికారికి పూర్తి కాపీని అందచేయాలి. చంద్రబాబు వీటిలో ఒక్కదానిని కూడా అనుసరించలేదు. దీంతో ఈ సమీక్షలను CEC దృప్టికి తీసుకువెడతామని అక్కడ నుండి వచ్చే ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఎన్నికల కోడ్‌ ప్రకారం ఈ తరహా సమీక్షలకు అధికారులు హాజరు కాకూడదని, ఒకవేళ సమీక్షలకు వెళ్లాలనుకుంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. దీనిని ఉల్లంఘించినందుకు సమావేశాలకు హాజరైన అధికారులందరికీ నోటీసులు పంపడానికి కసరత్తు జరుగుతోంది.

Latest Updates