అధికార పార్టీకి తొత్తుగా ఈసీ : తమ్మినేని

ఈసీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు సీపీఎం రాష్ట్ర కార్శదర్శి తమ్మినేని వీరభద్రం. రిజర్వేషన్లు ప్రకటించక ముందే ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు.

టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల్లో వేటితోనూ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోమన్నారు తమ్మినేని. కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు తమ్మినేని వీరభద్రం.

 

Latest Updates