సూర్యగ్రహణం ఎఫెక్ట్ : చూపు పోగొట్టుకున్నారు

డైరెక్ట్ గా చూడడంతో చూపు కోల్పోయిన 15 మంది


జైపూర్: ‘‘సూర్యగ్రహణాన్ని ఎప్పుడూ డైరెక్టుగా చూడకూడదు. అలా చేస్తే కళ్లు దెబ్బతింటాయి. దాన్ని చూసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఐ ప్రొటెక్షన్ గ్లాసెస్ లాంటివి వాడాలి” ఇదీ నిపుణులు ఎప్పుడూ చెప్పే మాట. కానీ జైపూర్ లోని కొందరు సూర్యగ్రహణాన్ని డైరెక్టుగా చూడడంతో రెటీనాలు కాలిపోయి చూపు పోగొట్టుకున్నారు. పోయినేడాది డిసెంబర్ 26న సూర్యగ్రహణం ఏర్పడింది కదా.. దాన్ని ఓ 15 మంది డైరెక్టుగా చూశారు. బాధితులంతా 10–20 ఏళ్లున్న వారే.

‘‘బాధితులకు ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నాం. అయితే మళ్లీ చూపు వచ్చే అవకాశం లేదు”అని జైపూర్ లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్ ఆప్తమాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ కమలేశ్ ఖిలాని తెలిపారు. ఇలా సూర్యగ్రహణాన్ని డైరెక్టుగా చూస్తే సోలార్ రెటినైటిస్ వస్తుందని, బాధితుల రెటీనాల్లో కొంత భాగం కాలిపోయిందని చెప్పా రు. వీరు కొంతమేర కోలుకోవడానికి 3–6 వారాలు పడుతుం దన్నారు.

see also:బెజోస్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసిన సౌదీ ప్రిన్స్‌ ఎంబీఎస్

దివ్యాంగురాలిని వరించిన అదృష్టం

ప్రధాని మోడీకి ఏరియల్ ఎటాక్ ​ముప్పు!

Latest Updates