జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు లక్ష కోట్లు

న్యూఢిల్లీ : జన్ ధన్ స్కీము కింద తెరచిన బ్యాంకు ఖాతాలలోని డిపాజిట్లు త్వరలోనే లక్ష కోట్ల రూపాయలను అధిగమించనున్నాయి. ప్రధాన మంత్రి మోడి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ జన్ ధన్‌ స్కీమును అయిదేళ్ల కిందట తెచ్చిన విషయం తెలిసిందే. ఏటేటా పెరుగుతున్నజన్‌ ధన్‌ డిపాజిట్లు , ఈ ఏప్రిల్‌ 3 నాటికి రూ.97,665.66 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వడేటా చెబుతోంది. జన్‌ ధన్‌ ఎకౌంట్లూ 35.39కోట్లకు చేరాయి. మార్చి 27, 2019 నాటికిజన్‌ ధన్‌ డిపాజిట్లు రూ. 96,107.35 కోట్లు .జన్‌ ధన్‌ స్కీము కింద 27.89 కోట్ల మంది ఎకౌంట్‌ హోల్డర్లకు రూపే డెబిట్‌ కార్డులు జారీ అయ్యాయి. దేశంలోని అందరికీ బ్యాంకింగ్‌ సదుపాయం అందుబాటులోకి తెచ్చే టార్గెట్‌ తో 2014 ఆగస్టులో జన్‌ ధన్‌ స్కీమును మొదలుపెట్టారు. స్కీము సక్సెస్‌‌‌‌ కావడంతో, ఈ ఎకౌంట్‌హోల్డర్లకు కల్పి స్తున్న యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌‌‌‌ కవర్‌ ను 2018 ఆగస్టులో రూ. లక్ష నుంచి రూ.2 లక్షలకు కేం ద్ర ప్రభుత్వం పెంచింది. జన్‌ ధన్‌ఎకౌంట్ల కింద ఇచ్చే ఓవర్‌ డ్రాఫ్ట్‌‌‌‌నూ రెట్టింపుఅంటే రూ. 10 వేలు చేశారు. జన్‌ ధన్‌ ఎకౌంట్లు తెరిచిన వారిలో సగం మంది మహిళలే.అందులోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారేఉన్నట్లు ప్రభుత్వ డేటా వెల్లడించిం ది. సమాజంలోని తక్కు వ ఆదాయ వర్గాలకు కనీస సేవింగ్స్‌‌‌‌ ఎకౌంట్‌ తోపాటు, అవసరమైనప్పుడు చిన్నఅప్పులు, నిధుల బదిలీ, ఇన్సూరెన్స్‌‌‌‌, పెన్షన్‌ వంటిసదుపాయాలను అందుబాటులోకి తేవాలనే ఈజన్‌ ధన్‌ స్కీమును ప్రవేశ పెట్టారు. డైరెక్ట్‌‌‌‌ బెనిఫిట్‌ట్రాన్స్‌‌‌‌ఫర్‌ (డీబీటీ) స్కీము కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును బెనిఫిషియరీ ఎకౌంట్లకు మళ్లించడానికి జన్‌ ధన్‌ స్కీము సాయపడుతుందనేది కూడా ప్రభుత్వ టార్గెట్లలో ఒకటి.

 

Latest Updates