సింధియాకు షాక్.. 6 ఏళ్ల క్రితం కేసు రీఓపేన్

షాకిచ్చిన ఎకానమిక్ ఆఫెన్స్ వింగ్

రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా గత బుధవారం బీజేపీలో చేరారు. ఆయన బీజేపీలో చేరిన రెండు రోజుల్లోనే ఆయనకు మధ్యప్రదేశ్ ఎకనామిక్ నేరాల విభాగం గట్టి షాకిచ్చింది. ఆరేళ్ల క్రితం ఆయనపై నమోదైన ఫోర్జరీ కేసును రీఓపేన్ చేస్తున్నట్లు ఎకానమిక్ వింగ్ తెలిపింది. సింధియా బీజేపీలో చేరిన రెండు రోజులకే ఈ కేసును తిరిగితోడడంపై ఎంపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.

జ్యోతిరాదిత్య సింధియా, ఆయన కుటుంబ సభ్యులపై పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాలను ధృవీకరించడం కోసం వారిపై కొత్తగా విచారణను ప్రారంభించాలని మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం నిర్ణయించింది. 10,000 కోట్ల విలువైన భూమిని విక్రయించేటప్పుడు సింధియా తప్పుడు ఆస్తి పత్రాన్ని ఇచ్చాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలను కలిసిన తరువాత సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రోజు బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో సింధియా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. సింధియా మార్చి 13న రాజ్యసభ ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

For More News..

పీసీసీ చీఫ్ నువ్వా.. నేనా..

ఇండియాలో కరోనా తొలి మరణం

అప్పుడు కేసీఆర్‌‌ను బండ బూతులు తిట్టిన

Latest Updates