మహాకూటమి వస్తే భారీ నష్టం : మోడీ

ప్రతాప్ గఢ్ : మహాకూటమి అధికారంలోకి వస్తే భారీ నష్టం తప్ప ఉపయోగం లేదన్నారు ప్రధాని మోడీ. యూపీ ప్రతాప్ గఢ్ లో ప్రచార సభలో పాల్గొన్నారు. అవినీతి, అస్తిరత, వంశవాదమే మిగులుతాయన్నారు. కాంగ్రెస్ నేతల అహంకారమే వారిని ఓడిస్తుందన్నారు మోడీ. భూమి నుంచి అంతరిక్షం వరకు కాంగ్రెస్ నేతలు ఏదీ వదిలిపెట్టరని ఆరోపించారు.

త్రివిధ దళాలు మోడీ సొంత ఆస్తి కాదన్నారు రాహుల్ గాంధీ. ఆర్మీని అవమానించేలా ప్రధాని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు, మహిళలు, రైతుల గురించి మోడీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. చౌకీదార్ ముమ్మాటికీ చోరేనన్నారు రాహుల్.

Latest Updates