ED షాక్: BCCIకి భారీ జరిమానా  

BCCI-FORMERబోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్  క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌( ED) భారీ జరిమానా విధించింది. IPL-2009 సందర్భంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు BCCI, బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌, లలిత్‌ మోడీ, ఇతరులకు ఈడీ రూ.121 కోట్ల జరిమానా విధించింది.

2009లో IPLను దక్షిణాఫ్రికాలో నిర్వహించే క్రమంలో భారత్‌ నుంచి విదేశాలకు నగదు బదిలీ చేసినప్పుడు అక్కడ ప్రత్యేక ఖాతా ఓపెన్ చేయాలి. ఇలా చేస్తే భారతీయ నిఘా, దర్యాప్తు సంస్థల పరిధిలోకి ఆ ఖాతా వస్తుంది. ఆయా సంస్థల నిఘా తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ప్రత్యేక ఖాతా తెరవలేదని దర్యాప్తులో తేలింది. అందుకు బదులుగా IPL నిర్వహణ కోసం భారీ స్థాయిలో విదేశీ మారక ద్రవ్యాన్ని క్రికెట్‌ దక్షిణాఫ్రికా ఖాతాకు బదిలీ చేసింది. క్రికెట్‌ దక్షిణాఫ్రికా వారి దేశంలో CSA-IPL పేరుతో ఓ బ్యాంకు ఖాతా తెరిచి అందులోకి స్థానిక కరెన్సీని బదిలీ చేసింది. రెండు బోర్డుల మధ్య ముందే కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం ఖాతాను పూర్తిగా BCCI మాత్రమే నిర్వహించింది. రూ.243 కోట్లను బదిలీ చేసే క్రమంలో ఫెమా అతిక్రమణ జరిగిందన్న ఆరోపణలపై బీసీసీఐకు రూ.82.66 కోట్లు, శ్రీనివాసన్‌కు రూ.11.53 కోట్లు, లలిత్‌ మోడీకి రూ.10.65 కోట్లు, బోర్డు మాజీ కోశాధికారి పాండవ్‌కు రూ.9.72 కోట్లు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌కు రూ.7 కోట్లను జరిమానాగా విధించింది.

 

Posted in Uncategorized

Latest Updates