చింపాంజీలను అటాచ్​ చేసిన ఈడీ

అక్రమ సంపాదనను, ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) అటాచ్​ చేసిన, చేస్తున్న సందర్భాలను చూస్తూనే ఉన్నాం. కానీ, ఇదో కొత్త కేసు. మూడు చింపాంజీలు, నాలుగు మార్మోసెట్ల (కోతి జాతికి చెందిన జంతువు)ను ఈడీ అటాచ్​ చేసింది. ఒక్కో చింపాంజి విలువ రూ. 25 లక్షలట. ఒక్కో మార్మోసెట్​ లక్షన్నర విలువ ఉంటుందట. మొత్తంగా రూ.81 లక్షలట వాటి విలువ. కోల్​కతాకు చెందిన సుప్రదీప్​ గుహ అనే వ్యక్తి వీటిని అక్రమంగా ఇంట్లో పెంచుకుంటున్నాడన్నది ఆరోపణ. స్థానిక కోర్టులో వైల్డ్​లైఫ్​ డిపార్ట్​మెంట్​ వైల్డ్​లైఫ్​ ప్రొటెక్షన్​ యాక్ట్​ కింద కేసు పెట్టింది. ఫోర్జరీ చేసిన పర్మిషన్​ లెటర్​తో డాక్యుమెంట్లను తయారు చేసినందుకు గానూ పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి అరెస్ట్​ చేశారు. ఆ కేసు ఈడీ చేతికి రావడంతో ఆ జంతువులను అటాచ్​ చేసింది.

ED attaches Chimpanzees, Marmosets worth Rs 81 lakh in money laundering case

Latest Updates