లండన్‌లోని యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణాకపూర్ రూ. 127 కోట్ల ప్లాట్ జప్తు

మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యెస్ బ్యాంకు ప్రమోటర్లలో ఒకరు రాణా కపూర్‌. ఆయనకు లండన్‌లో ఉన్న రూ. 127 కోట్ల విలువైన ప్లాట్‌ను ఈడీ జప్తు చేసింది. 2017లో 99 లక్షల పౌండ్ల (రూ.93 కోట్లు)కు డీఓఐటీ క్రియేషన్స్ జెర్సీ లిమిటెడ్ పేరుతో రాణాకపూర్ ఈ ప్లాట్‌ను కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.

రాణాకపూర్ తన ఆస్తిని  అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారని, అందులో భాగంగా ఓ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ను కూడా నియమించుకున్నట్టు తెలిపారు. మరోవైపు, మోర్గాన్‌ క్రెడిట్‌ నిధుల సేకరణకు సంబంధించిన వివరాలను స్టాక్‌ మార్కెట్లకు చెప్పనందుకు గాను రాణాకపూర్‌పై క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కోటి రూపాయల జరిమానా విధించింది.

Latest Updates