28 నుంచి ఎడ్‌ సెట్‌ అప్లికేషన్స్‌

  • మే 31న ఎంట్రెన్స్‌.. జూన్‌ 15న రిజల్ట్స్‌
  • ఈ నెల 25 నుంచి పీఈసెట్‌ అప్లికేషన్స్‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎడ్‌ సెట్‌‌‌‌ ప్రవేశ పరీక్షకు ఈ నెల 28 నుంచి ఆన్‌ లైన్‌లో అప్లికేషన్స్‌‌‌‌ తీసుకోనున్నట్టు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. హైదరాబాద్‌ లో గురువారం మండలి చైర్మన్‌ పాపిరెడ్డి ఆధ్వర్యంలో  ఎడ్‌ సెట్‌‌‌‌ కమిటీ సమావేశమైంది. ఈ నెల 25న ఎడ్‌ సెట్‌‌‌‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్‌‌‌‌ 20 వరకు ఫైన్‌ లేకుండా, వెయ్యి ఫైన్‌ తో ఏప్రిల్‌‌‌‌ 30 వరకు
దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు రూ.450, జనరల్ అభ్యర్థులకు రూ.650
పరీక్ష ఫీజు నిర్ణయించారు. మే 31న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
ఎంట్రెన్స్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఉంటుంది. హైదరాబాద్‌, వరంగల్‌‌‌‌, నల్లగొండ, కరీంనగర్‌‌‌‌, నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌‌‌‌, కోదాడ, ఆదిలాబాద్‌ , ఏపీలో విజయవాడ, కర్నూల్‌‌‌‌లో పరీక్ష కేంద్రాలుంటాయి. జూన్ 15న ఫలితాలు విడుదల చేస్తారు.
25 నుంచి పీఈసెట్‌ దరఖాస్తులు
ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌ (పీఈసెట్‌‌‌‌) నోటిఫికేషన్‌ ఈనెల 18న విడుదల చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. 25 నుంచి ఏప్రిల్‌‌‌‌ 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మే 15 నుంచి ఫిజికల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లు నిర్వహిస్తామని చెప్పారు.

Latest Updates