యుబీలో విజయ్ మాల్యా షేర్లు అమ్మేశారు

ED recovers Rs. 1,008 crore by selling Mallya’s shares in United Breweries

న్యూఢిల్లీ : విజయ్‌ మాల్యా నుంచి బకాయిలు రాబట్టేందుకు కీలక అడుగు పడింది. యూనిటెడ్ బ్రేవరీస్‌ హోల్డిం గ్స్ లిమిటెడ్(యూబీహెచ్‌ ఎల్)లో విజయ్‌ మాల్యా కున్న రూ.1,008 కోట్ల విలువైన షేర్లను డెట్ రికవరీ ట్రైబ్యునల్ అమ్మేసినట్టు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్  కేసు విచారణలో భాగంగా ఈడీ ఈ షేర్లను అటాచ్ చేసింది. బెంగళూరులోని డెట్రికవరీ ట్రైబ్యునల్‌‌కు ఈ షేర్లను సరెండర్ చేయాలని కర్నాటక  హైకోర్టు ఆదేశించింది. ఈ షేర్ల విక్రయాలపై  స్టే విధించాలని యునిటెడ్ బ్రేవరీస్(యూబీఎల్) వేసిన పిటిషన్‌‌ను కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్(పీఎంఎల్‌‌ఏ) కోర్టు తోసిపుచ్చింది. స్టే  పిటిషన్‌‌ను కొట్టివేసిన సీనియర్ జడ్జి ఎంఎస్అజ్మి ,షేర్ల సేల్‌‌పై  స్టే విధించే అధికారం కోర్టుకు లేదని చెప్పా రు. పీఎంఎల్‌‌ఏ కోర్టు నుంచి అనుమతి  రాగానే, డెట్ రికవరీ ఆఫీసర్ ఈ షేర్లను రూ.1,008 కోట్లకు అమ్మేసి నట్టు ఈడీ తెలిపింది. మొత్తంగా 74,04,932 షేర్లను విక్రయించారు. బ్యాంక్‌‌లకు రూ.9వేల కోట్లుఎగవేసి విదేశాలకు వెళ్లిన మాల్యా నుం చి బకాయిలు రాబట్టేందుకు, అతన్ని ఇండియాకు రప్పించేందుకు ఈడీ, సీబీఐ, బ్యాంక్‌‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2016 మార్చి లో మాల్యా దేశం విడిచి పారిపోయిన తర్వాత తొలిసారి నిర్వహిస్తోన్న షేర్ల విక్రయమిదే.

Latest Updates