చందా కొచ్చర్ కు ED సమన్లు

మనీలాండరింగ్‌ క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్న ICICI బ్యాంకు మాజీ CEO చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సమన్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 30న దీపక్‌ కొచ్చర్‌, ఆయన సోదరుడు రాజీవ్‌, మే 3న చందా కొచ్చర్‌ అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. విచారణ సమయంలో వారి వ్యక్తిగత, వృత్తి పరమైన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాల్సిందిగా వారికి తెలియజేశారు. గతంలో ఈ కేసుకు సంబంధించి ముంబై, ఔరంగాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న చందా కొచ్చర్‌, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోకాన్‌ గ్రూప్‌కి చెందిన వేణుగోపాల్ ధూత్‌ ఇళ్లలో సోదాలు చేసిన తర్వాత ముంబైలోని ED కార్యాలయంలో వారిని విచారించారు.

వీడియోకాన్‌ గ్రూప్‌ రుణాల అవకతవకల వివాదం కారణంగా చందా కొచ్చర్‌ గతేడాది అక్టోబరులో ICICI బ్యాంకు CEO పదవి నుంచి తప్పుకున్నారు.

 

Latest Updates