టెక్నాలజీలో పాజిటివ్స్, నెగెటివ్స్ రెండూ ఉన్నాయ్

టెక్నాలజీపై చదువుకున్నోళ్ల ఆశ, నిరాశలు

పెద్ద చదువులు చదువుకునోళ్లలో కొందరు టెక్నాలజీ అందలాన్ని ఎక్కిస్తుందని నమ్ముతుంటే, మరికొందరు పాతాళంలోకి తోసేస్తుందని విశ్వసిస్తున్నారట. తక్కువ చదువుకున్న ఇండియన్లలో 39 శాతం మంది,  ఎక్కువ చదువుకున్న వాళ్లలో 60 శాతం మంది టెక్నాలజీ రాజకీయ అభిప్రాయాన్ని మార్చుతోందని నమ్ముతున్నారని ‘ప్యూ రీసెర్చ్’ లో తేలింది. చాలా విషయాల్లో టెక్నాలజీపై ఎక్కువ చదువుకున్నోళ్లు ఆశ, నిరాశలను కనబర్చారని చెప్పింది. అసత్య ప్రచారం పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపుతోందని  చదువు తక్కువగా ఉన్న వాళ్లు 59 శాతం మంది చెబితే, 69 శాతం మంది ఎక్కువ చదువుకున్నోళ్లు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఎక్కువ చదువు.. ఎక్కువ నమ్మకం

హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్లలో ఎక్కువ మంది టెక్నాలజీపై ఎక్కువ నమ్మకాన్ని చూపుతున్నారని ప్యూ వెల్లడించింది. భిన్న ఆలోచనలు, అభిప్రాయాలు కలిగిన వారిని గౌరవించేలా జనాన్ని టెక్నాలజీనే మార్చిందనే మాటకు 33 శాతం మంది తక్కువ చదువుకున్న వాళ్లు అవునని అంటే, 48 శాతం మంది ఎక్కువ చదువుకున్న వాళ్లు కరెక్టేనని అభిప్రాయపడ్డారు. ట్యునీసియా, కెన్యా, ఫిలిప్పీన్స్, మెక్సికో తదితర 11 దేశాల్లో కూడా ప్యూ ఇదే రీసెర్చ్ ను చేసింది.

కేవలం కెన్యా, ఇండియాల్లో మాత్రమే టెక్నాలజీ గురించి బాగా చదువుకున్నోళ్లకు, తక్కువ చదువుకున్నోళ్లకు అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉన్నాయని ప్యూ వివరించింది. సోషల్ మీడియాను బాగా వాడే ఎక్కువ చదువుకున్న వర్గం, టెక్నాలజీపై పాజిటివ్ గానూ, అదే స్థాయిలో నెగెటివ్ గానూ స్పందించినట్లు పేర్కొంది.