చదువే సమాజాన్ని మారుస్తుంది

 -కేంద్ర విద్యాశాఖ మంత్రి  రమేశ్​పోఖ్రియాల్ నిశాంక్

వర్చువల్ ఆన్​లైన్​ మోడ్​లో వరంగల్ నిట్​ 18వ కాన్వొకేషన్​

కాజీపేట, వెలుగు: చదువు అనేది స్టూడెంట్ల జీవితంతోపాటు సమాజాన్ని మార్చే ఆయుధమని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​నిశాంక్​ అన్నారు. వరంగల్​లోని నేషనల్​ ఇన్​ స్టిట్యూట్​ ఆఫ్ ​టెక్నాలజీ(నిట్) 18వ స్నాతకోత్సవాన్ని గురువారం ఆన్​లైన్​లో నిర్వహించారు. అంతకుముందు ఎన్​ఐటీలో కొత్తగా నిర్మించిన పండిట్​ మదన్​మోహన్​ మాలవ్య టీచింగ్​ సెంటర్, విశ్వేశ్వరయ్య స్కిల్​ డెవలప్​మెంట్ ​సెంటర్, సర్దార్​ వల్లభాయ్ ​పటేల్​ గెస్ట్​ హౌస్​ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆన్​లైన్ ​ద్వారా ప్రారంభించారు. నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ  వెల్లడించిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్​లో  వరంగల్ నిట్ 19వ స్థానంలో ఉందని చెప్పారు. వివిధ ఏజెన్సీల నుంచి 41 కోట్ల విలువైన 137 పరిశోధన ప్రాజెక్టులు ఈ సంస్థకు మంజూరయ్యాయని చెప్పారు. స్నాతకోత్సవంలో 1,607 మందికి సర్టిఫికెట్లను ఆన్ లైన్​లో నిట్ డైరెక్టర్, డీన్ లు ప్రదానం చేశారు. బీటెక్​ కెమికల్ ​ఇంజినీరింగ్ స్టూడెంట్ అపూర్వ భరద్వాజ్ ఇంజినీరింగ్ బ్రాంచిలో  అత్యధిక సీజీపీఏ సాధించి నిట్  టాపర్ గా గోల్డ్ మెడల్ తీసుకున్నారు.

Latest Updates