కరోనా హాలీడేస్ ఇవ్వని ప్రైవేట్ స్కూల్స్.. నోటీసులు జారీ

కరోన వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుందేమోనన్న భయంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వాటితో పాటుగా సినిమా థియేటర్లు, మద్యం దుకాణాలు మరియు ఫంక్షన్ హాల్స్ కు కూడా ఈ నెల 31 వరకు కొన్ని నియమాలతో కూడిన బంద్ ప్రకటించింది. వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేసిన ఈ అదేశాలను కొన్ని ప్రైవేట్ స్కూల్స్ పట్టించుకోకుండా యథావిధిగా వాటిని నడుపుతుంది.

ఈ విషయం విద్యాశాఖ దృష్టికి రావడంతో నగరంలోని పలు విద్యాలయాలు ఇన్స్‌పెక్షన్ నిర్వహించింది. అధికారుల తనిఖీల్లో హైదరాబాద్ లోని మొత్తం పది ప్రైవేట్ పాఠశాలలు క్లాసులు నడిపిస్తున్నట్టగా తెలిసింది. దీంతో విద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రరామచంద్రన్ ఆ పాఠశాలలకు నోటిససులు జారీ చేశారు. ఆ స్కూళ్లపై   తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరెవరైనా ప్రభుత్వ అదేశాలను కాదని స్కూల్స్ నడుపుతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 తనిఖీలు చేపట్టిన ఆ పది ప్రైవేట్ స్కూళ్లు ఇవే

  1. VIP ఇంటర్నేషనల్ స్కూల్ (సైదాబాద్,చార్మినార్, బహదూర్ పుర )
  2. స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ (చార్మినార్)
  3. షిరీన్ పబ్లిక్ స్కూల్ (సికింద్రాబాద్)
  4. ఖుష్బూ స్కూల్ (షేక్‌పేట్)
  5. జాషువా స్కూల్ (షేక్‌పేట్)
  6. సన్‌రైజ్ స్కూల్ (షేక్‌పేట్)
  7. రోజరీ కాన్వెంట్ స్కూల్ (గన్ ఫౌండ్రి)
  8. ఆల్ సెయింట్స్ హై స్కూల్  (గన్ ఫౌండ్రి)
  9. లిటిల్  ఫ్లవర్ స్కూల్ (అబిడ్స్)
  10. సెయింట్ మార్క్స్ టౌన్ స్కూల్ (బహదూర్‌పుర)

Latest Updates