పుకార్లు న‌మ్మొద్దు .. మీర్‌పేట్ చెరువుకు గండిప‌డ‌లేదు

హైద‌రాబాద్: నగరంలోని మీర్ పెట్ చెరువుకు గండి పడిందనే వార్తలు అవాస్తవమ‌ని తేల్చి చెప్పారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మీర్‎పేట చెరువు కట్ట ప్రమాదకరంగా మారిందని, చెరువు పరిసర లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తిందన్న వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను మంత్రి ఖండిస్తూ.. పుకార్లను నమ్మవద్దని,అసత్యాలు ప్రచారం చేయవద్దని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

మంగ‌ళ‌వారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,అడిషనల్ కలెక్టర్,మేయర్,డిప్యూటీ మేయర్ ,కార్పొరేటర్,మీడియా తో కలిసి మంత్రి స‌బిత‌.. మీర్ పెట్ చెరువును పరిశీలించారు. గండి ఎక్కడ పడిందో చూపాలంటూ, పుకార్లు సృష్టించి ప్రజలను ఆందోళన కు గురిచేయవద్దని అన్నారు.

Latest Updates