31 వరకు ఏపీలో విద్యాసంస్థలు బంద్

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలకు ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం హై అలర్ట్ ప్రకటించిన అక్కడి ప్రభుత్వం ఈ నెల 31 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసేయాలని అదేశాలిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరులో సెలవులపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Latest Updates