బడ్జెట్ 2019: ట్యాక్స్ లో ఊరట లేదు

  • రూ.5 లక్షల ఆదాయం వరకు మినహాయింపు
  • మొదటిసారి ఇల్లు కొన్నవారికి అదనపు తగ్గింపు
  • ఎలక్ట్రిక్‌ వాహనం కొన్నా పన్ను ప్రయోజనాలు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లోనరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నుల వ్యవస్థలో పలుమార్పులను ప్రతిపాదించింది . ఆదాయపన్ను స్లాబ్‌ రేట్లను యథాతథంగా ఉంచుతూనే, ట్యాక్స్‌ పేయర్లను ప్రభావితం చేయగల కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు . ఐటీ రిటర్నులు సమర్పించడానికి పాన్‌ కార్డు లేకుంటే ఇక నుంచి ఆధార్‌ కార్డును ఇవ్వొచ్చు.

  • సాధారణ ట్యాక్స్‌ పేయర్లకు రూ.ఐదు లక్షలవరకు ఎలాంటి పన్నూ ఉండదు. రూ.45 లక్షలలోపు ధర కలిగిన ఇల్లు కొన్న వారికి అదనంగా రూ.1.5 లక్షల మేరకు పన్ను మినహాయింపు ఇచ్చారు . వచ్చే ఏడాది మార్చి వరకు తీసుకునే హోం లోన్లకు ఈ సదుపాయం వర్తిస్తుంది. ప్రస్తుతం రూ.లక్ష వరకు హోంలోన్ల వడ్డీపై పన్ను మినహాయింపు ఉండగా, ఇప్పుడు దీనిని రూ.3.5 లక్షలకుపెంచారు.
  • ఎలక్ట్రిక్‌‌‌‌ వాహనాలు కొనడానికి తీసుకునేఅప్పుపై రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్నును మినహాయిస్తారు .
  • ఒక సంవత్సరంలో రూ.కోటి కంటే ఎక్కువనగదు విత్‌ డ్రా చేసుకుంటే రెండు శాతం టీడీఎస్‌ వసూలు చేస్తారు.
  • కేంద్ర ప్రభుత్వ సంస్థల ఈటీఎఫ్‌ లలో రిటైల్ ఇన్వెస్టర్లకు ఈక్విటీ లింక్డ్‌‌‌‌ సేవింగ్స్‌ స్కీమ్‌ తరహా ఐటీ ప్రయోజనాలు కల్పిస్తారు .ప్రస్తుత నిబంధనల ప్రకారం మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉన్న ఈఎల్‌‌‌‌ఎస్‌ ఎస్‌ మ్యూచువల్‌‌‌‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తే రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
  • ఏడాదిలో రూ.రెండు కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉండే హెచ్‌ ఎన్‌ ఐలకు (హై నెట్‌ వర్త్‌‌‌‌ ఇండివిజువల్స్‌ ) ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ సర్‌ చార్జ్‌‌‌ను పెంచారు. రూ.2–5 కోట్ల మద్య ఆదాయంఉన్న వాళ్లు అదనంగా మూడు శాతం చెల్లించాలి. సర్‌ చార్జ్‌‌‌‌ రేటును 15 శాతం నుంచి 25 శాతానికి పెంచడమే ఇందుకు కారణం. రూ.ఐదు కోట్ల వరకు ఆదాయం ఉన్న హెచ్‌ ఎన్‌ ఐలపై సర్‌ చార్జ్‌‌‌‌ను 15 శాతం నుంచి 37శాతానికి పెంచారు.
  • రూ.కోటి అంతకంటే ఎక్కువ మొత్తం విలువ గల లావాదేవీలు జరిపిన ప్రతి ఒక్కరూ ఐటీఆర్‌ ఫైల్‌‌‌‌ చేయాలి. ఇలాంటి వారి వార్షికాదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉన్నా ఐటీఆర్‌ దాఖలు చేయాలి. వ్యక్తిగతంగా రూ.రెండు లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినా,విదేశీయానం చేసినా ఐటీఆర్​ తప్పనిసరి.

 

Latest Updates