ఫాసిస్టు బీజేపీని ఇంటికి పంపేందుకు కృషి: చంద్రబాబు

ఫాసిస్టు బీజేపీని ఇంటికి పంపేందుకు దేశమంతాతిరిగి ప్రచారం చేస్తున్నానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. లోక్‌సభ ఎన్నికల జాతీయ ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్న చంద్రబాబు బుధవారం లాల్ గఢ్, హాల్దియా బహిరంగ సభలో పాల్గొన్నారు. జార్ గ్రాయ్, తామ్ ‌లుక్ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధులను పరిచయం చేస్తూ ఘన విజయం చేకూర్చాలని కోరారు. ప్రచారంలో భాగంగా  మొదట బెంగాలి భాషలో మాట్లాడిన బాబు ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, అక్కడ మహనీయుల గొప్పతనం గురించి వివరించారు. తర్వాత ఇంగ్లిష్ లో మాట్లాడిన ఆయన ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేయడానికి ఇక్కడి వచ్చానని.. మమతా బెనర్జీ అంటే ఎంతో గౌరవం ఉందన్నారు. కేవలం బెంగాల్ లో మాత్రమే ప్రచారం చేయడం లేదన్న చంద్రబాబు… ప్రజాస్వామ్య పరిరక్షణకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా మతతత్వ, ఫాసిస్టు బీజేపీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజలను జాగృతం చేయడానికి దేశమంతా పర్యటిస్తానన్నారు.

Latest Updates