ఈ ఎమోజీలతో యూత్ చెడిపోతున్నారు

సోషల్ మీడియాలో మెసేజ్ చేసేటప్పుడు ఈజీగా ఉండేందుగా రకరకాల ఎమోజీలను వాడుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ఎమోజీలను నిషేధిస్తున్నట్లు తెలిపాయి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్. యూత్ ను పాడు చేసేలా ఉన్న ఎమోజీలతో కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఫిర్యాదుల రావడంతో కొన్ని ఎమోజీలను బ్యాన్ చేస్తున్నాట్లు చెప్పాయి.

లైంగిక వాంఛను తెలిపే లేదా సూచించే వంకాయ, పిక్క ఉండే పీచ్‌ పండు, కింద పడుతున్న నీటి బిందువుల ఎమోజీలను బ్యాన్ చేస్తున్నట్లు తెలిపాయి. వీటితో సహా లైంగిక కోరికలను తెలియజేసే ఇతర ఏ ఎమోజీని వాడరాదంటూ యూజర్లకు కొత్త రూల్స్ విడుదల చేశాయి. అలాగే నగ్న ఫొటోల పోస్టింగ్‌ ను కూడా నిషేధిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలియజేయలేదు. ఈ రెండు సామాజిక వేదికలను వేశ్యలు తమ లైంగిక వ్యాపారం కోసం వాడుకోకుండా నివారించేందుకే ఈ నిషేధం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Latest Updates