రోడ్డుపై కోడిగుడ్ల వెహికిల్ బోల్తా…

కోడిగుడ్లతో వెళ్తున్న వాహనం బోల్తాపడి గుడ్లన్నీ రోడ్డుపై పగిలిపోయాయి. ఈ ఘటన మంగళవారం పొద్దున హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ కమలా హాస్పిటల్ ముందు జరిగింది. కోడి గుడ్లు రోడ్డుపై పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ తో నీళ్లు కొట్టి రోడ్డును శుభ్రం చేశారు.

Latest Updates