ఈఫిల్ టవర్ లైట్స్ ఆఫ్ : శ్రీలంక మృతులకు నివాళి

ప్రపంచానికి శ్రీలంకలో టెర్రర్ ఎటాక్ షాకిచ్చింది. వరుసగా 8 సార్లు బాంబుపేలుళ్లతో ఆ దేశంలో జరిగిన మారణహోమంతో ప్రపంచమే దిగ్భ్రాంతి చెందుతోంది. శ్రీలంకకు ఈ కష్టసమయంలో అండగా ఉంటామంటూ ప్రపంచదేశాలు ప్రకటించాయి. ప్యారిస్ ప్రభుత్వం కూడా సంతాపం ప్రకటించింది. అందుకు సూచనగా…. ప్యారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్.. డార్క్ మోడ్ లోకి వెళ్లింది.

రాత్రివేళ ఈఫిల్ టవర్ ను చూసేందుకు ఎక్కువ మంది వస్తుంటారు. నైట్ టైమ్ లో అక్కడి వెలుగులు కళ్లు చెదిరేలా ఉంటాయి. లైటింగ్ లో ఈఫిల్ టవర్ మెరిసిపోతుంటుంది. అలాంటి ఈ భారీ ఇనుపకట్టడం… నిన్న రాత్రి కళ తప్పింది. శ్రీలంక మృతులకు సంతాపం ప్రకటించడంలో ఈఫిల్ టవర్ భాగమైంది. ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా… మృతుల ఆత్మకు శాంతికలగాలని ఆకాంక్షిస్తూ… అర్ధరాత్రి వేళ ఈఫిల్ టవర్ లైట్స్ ను ఆపేశారు. కొద్దిసేపు ఈఫిల్ టవర్ అంధకారంలోనే ఉండిపోయింది.

ఆదివారం శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో 215 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.

Latest Updates