ప‌ని మ‌నిషికి క‌రోనా ల‌క్ష‌ణాలు.. ఖమ్మంలో 8కి చేరిన పాజిటివ్ కేసులు

ఖమ్మం లో మరో పాజిటివ్ కేసు నమోదైంది. ఖిల్లా ప్రాంతంలోని బీకే బజార్ లో ఓ కుటుంబంలోని ఐదుగురు వ్య‌క్తుల‌కు గ‌తంలో కరోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆ ఇంటిలో పనిచేసే మహిళకు కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు అధికారులు గుర్తించారు. 5 రోజుల క్రితం ఆ మ‌హిళ‌ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఐసొలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు . క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆమెను హైదరాబాద్ లోని గాంధీ ఆస్ప‌త్రికి తరలించనున్నారు.. ఈ కేసుతో జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా పాజిటివ్ లు 8 కి చేరాయి.

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండ‌డంతో బీకే బజార్‌ను కలెక్టర్‌ ఆర్వీ కణ్ణన్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఖమ్మంలో పాజిటివ్‌ కేసులన్నీ ఒకరి ద్వారానే వ్యాపించాయని ఆయ‌న తెలిపారు.

eight active cases from Khammam district: collector r v kannan

Latest Updates