24 గంటల్లో 8 మంది టెర్రరిస్టులు హతం

  • మసీదులో దాక్కున్న ఇద్దర్నీ చంపేసిన సెక్యూరిటీ

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌‌లలో 8 మంది టెర్రరిస్టులు చనిపోయారు. పంపోర్‌‌ జిల్లాల్లో మసీదులో దాక్కున్న ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చినట్లు అధికారులు చెప్పారు. మసీదుకు ఎలాంటి డ్యామేజ్‌ కాకుండా, ఫైరింగ్‌ జరపకుండా ఐఈడీలు ఉపయోగించకుండా దుండగులను బయటికి రప్పించి హతమార్చామన్నారు. షోపియాన్‌, పంపోర్‌‌ రేంజ్‌లో టెర్రరిస్టులు దాగి ఉన్నారనే పక్కా సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఆ సమయంలో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో షోపియాన్‌ జిల్లాలో ఐదుగురు, పంపోర్‌‌ జిల్లాకు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆపరేషన్‌ కొనసాగినట్లు తెలుస్తోంది. ఇద్దరు టెర్రరిస్టులు మసీదులో దాక్కున్నారని, టియర్‌‌ గ్యాస్‌ ఉపయోగించి వారిని బయటికి రప్పించి కాల్చి చంపినట్లు చెప్పారు.

Latest Updates