కరోనా లక్షణాలు త్వరగా బయటపడ్తలే

గుర్తించి ఐసోలేట్ చేయాలంటున్న మేధావులు
భారీ స్థాయిలో టెస్టింగ్స్ అవసరమని సూచన
హైదరాబాద్: దేశంలోని ప్రధాన10 రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో మూడింట రెండొంతుల మందికి టెస్టింగ్ టైమ్ లో ఎటువంటి లక్షణాలు బయటపడకపోవడం (అసింప్టోమాటిక్) ఎక్కువవుతోంది. స్టేట్ గవర్నమెంట్స్ డేటా ప్రకారం కొందరు వ్యక్తులు తమకు తెలియకుండానే ఇతరులకు ఈ వైరస్ ను సోకేలా చేస్తున్నారని అర్థమవుతోంది. అందుకే భారీ స్థాయిలో టెస్టులు నిర్వహించి అలాంటి పేషెంట్స్ ను ఐసోలేషన్ లో ఉంచాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు సూచిస్తున్నారు. దేశంలో 80 శాతం కేసులు అసింప్టోమాటికే అని, వారిని గుర్తించడం తలనొప్పిగా మారిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్​మెడికల్ రీసెర్చ్ లో పని చేస్తున్న డా.రహ్మాన్ ఆర్ గంగాఖేద్కర్ అనే సీనియర్ సైంటిస్ట్ తెలిపారు. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో 65 శాతం, ఉత్తరప్రదేశ్ లో రికార్డ్ అయిన మొత్తం కేసుల్లో 75 శాతం పేషెంట్లకు టెస్టింగ్ టైమ్ లో ఎలాంటి లక్షణాలు బయటపడలేదని సమాచారం. అలాగే అస్సాం కేసుల్లో 82 శాతం ప్రజలకూ పరీక్షల సమయంలో సింప్టమ్స్ బయటపడలేదని చెప్తున్నారు.

యంగ్ స్టర్స్ లో ఇమ్యూన్ సిస్టమే కారణమా!
టెస్టింగ్ టైమ్ లో ఈ వ్యాధికి సంబంధించిన ప్రమాదకర లక్షణాలు ప్రజల్లో కనిపించలేదని అస్సాం హెల్త్ మినిస్టర్ హిమంత బిస్వ శర్మ తెలిపారు. ఢిల్లీలో 186 మంది కరోనా నిర్ధారితులకు ముందు రోజు వరకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవన్నారు. తమ రాష్ట్రంలో నమోదయ్యే కరోనా కేసుల్లో చాలా మటుకు ఎలాంటి లక్షణాలు లేనివేనని హర్యానా కు చెందిన డా.సూరజ్ భాన్ కాంబోజ్ తెలిపారు. గుడ్ ఇమ్యూనిటీ ఉన్న యువకులకు కరోనా లక్షణాలు ఉన్నా.. వారికి తెలియదని రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్ ఇన్ బెంగళూరు డెరెక్టర్ డాక్టర్ సి.నాగరాజు చెప్పారు. ఏ విధమైన వ్యాధి లక్షణాలూ లేని 20 నుంచి 45 ఏళ్ల వయసున్న పేషెంట్లు చాలా సంఖ్యలో ఉంటారని చెప్పారు. ఇమ్యూనిటీ వీక్ గా ఉండి, అనారోగ్య పరిస్థితులు ఉన్న వారిలోనే కరోనా లక్షణాలు త్వరగా బయటపడతాయన్నారు. కేరళలోని పాథనంథిట్ట జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తబ్లిగీ జమాత్ కు వెళ్లిన వారితో కలసి ప్రయాణం చేసింది. ఆమెను 22 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. అబ్జర్వేషన్ పీరియడ్ ముగింపు సమయంలో ఆ స్టూడెంట్ కు కరోనా లక్షణాలు బయటపడటం మొదలైందని జిల్లా మెడికల్ ఆఫీసర్ షీజా తెలిపారు.

ఒప్పుకోని చైనా, సౌత్ కొరియా
అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో అసింప్టోమాటిక్ పేషెంట్స్ సంఖ్య ఎక్కువగానే ఉన్నా ఒప్పుకోవడానికి ఆయా కంట్రీస్ నిరాకరిస్తున్నాయి. చైనా, సౌత్ కొరియా లాంటి దేశాలు ఈ కోవలోకే వస్తాయి. చైనాలో 43 వేల మంది అసింప్టోమాటిక్ పర్సన్స్ ఐసోలేషన్ లో ఉన్నారని, సౌత్ కొరియాలో ఈ సంఖ్య 30 వేల వరకు ఉండొచ్చని స్థానిక నివేదికల ప్రకారం తెలుస్తోంది. కాగా, కొందరు ఎక్స్ పర్ట్స్ మాత్రం అసింప్టోమాటిక్ పేషెంట్స్ తో పెద్దగా ప్రమాదమేమీ ఉండదని.. ఈ ట్రాన్స్ మిషన్ ను లాక్ డౌన్ తో బ్రేక్ చేయొచ్చని అంటున్నారు.

Latest Updates