పాక్ జూమ్ మీటింగ్‌‌ హ్యాక్.. బ్యాగ్రౌండ్‌‌లో రాముడు, హనుమంతుడి పాటలు

న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌ నిర్వహించిన జూమ్ లైవ్ మీటింగ్‌‌ హ్యాకింగ్‌‌కు గురైంది. ఈ మీటింగ్‌‌లో భగవాన్ శ్రీరాముడు, హనుమాన్ భక్తి గీతాలు ప్లే అయ్యాయి. ఫేస్‌‌బుక్‌‌లో బ్రాడ్‌‌కాస్ట్ అయిన ఈ ఆన్‌‌లైన్ మీటింగ్‌‌లో పలు దేశాలకు చెందిన ఎక్స్‌‌పర్ట్స్ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌‌లో 72 ఏళ్లుగా భారత్ అధీనంలో ఉన్న కశ్మీర్ అనే అంశంపై చర్చించారు.

ఇండియాకు వ్యతిరేకంగా ఈ మీటింగ్‌‌ నిర్వహిస్తున్నారనే సమాచారంతో భారత్ అనుకూల యూజర్ ఈ మీటింగ్‌‌ను హ్యాక్ చేశాడు. అంతేగాక అందులో ‘ఏక్ హీ నారా, ఏక్ హీ నామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్‘ అనే రాముడి పాటలను ప్లే చేశాడు. అలాగే హనుమంతుడి పాటలతోపాటు దేశభక్తి పాటలను కూడా ప్లే చేశాడు. మేం భారతీయులం, మేం మిమ్మల్ని తంతాం అంటూ జూమ్ మీటింగ్‌‌ బ్యాగ్రౌండ్‌‌లో హ్యాకర్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest Updates