దేశ భద్రతతో ఆటలొద్దు.. మోడీకి కాంగ్రెస్ వార్నింగ్

Election 2019: Congress resolves to rescue India from BJP
  • వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోడానికే బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్
  • సుపరిపాలన మాకే సాధ్యం: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం
  • గాంధీనగర్‌‌లో భారీ బహిరంగ సభ

ఐదేండ్ల నరేంద్ర మోడీ పాలనలో దేశమంతటా అభద్రతా భావం పెరిగిపోయిందని, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కుప్పకూలాయని కాంగ్రెస్​ పార్టీ ఆరోపించింది. తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే మోడీ ఫాల్స్ ప్రాపగండాకు తెరలేపారని, అందులో భాగంగానే నేషనల్​ సెక్ యూరిటీ అంశంపై నాటకాలాడుతున్నారని మండిపడింది. మోడీ ధ్వంసం చేసిన వ్యవస్థల్ ని తిరిగి గాడిలో పెట్టగల సత్తా కాంగ్రెస్​కు మాత్రమే ఉన్నదని పేర్కొంది. అహ్మదాబాద్​ వేదికగా మంగళవారం జరిగిన కాంగ్రె స్​ వర్కింగ్​ కమిటీ (సీడబ్ల్ యూసీ) సమా వేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించినట్లు పార్టీ సీనయర్​ నేత ఆనంద్​ శర్మ మీడియాకు తెలిపారు.

రాహుల్​ గాంధీ అధ్యక్షతన జరిగిన సీడబ్ల్ యూసీ భేటీలో సోనియా గాంధీ, మన్మోహన్​ సింగ్​, అహ్మద్​ పటేల్​, గులాం నబీ ఆజాద్​ తదితర సీనియర్లతోపాటు ప్రియాంక గాంధీ తొలిసారి హాజరయ్యారు. సీడబ్ల్ యూసీ భేటీ అనంతరం గాంధీనగర్​లో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ , ప్రియాంక తదితరులు మాట్లాడారు. తొలి రాజకీయ ప్రసంగంతోనే ప్రియాంక ఆకట్టుకున్నారు. టెర్రర్​ అటాక్స్ తో ఇండియాను విచ్ఛిన్న చేయాలని చూసే విద్రోహ శక్తుల చర్యల్ని ఖండిస్తున్నట్లు సీడబ్ల్ యూసీ తీర్మానంలో పేర్కొ న్న కాంగ్రెస్​ పార్టీ, దేశ భద్రతలో సైనిక బలగాల ధైర్యసాహసాలకు గర్వపడుతున్నట్లు పేర్కొంది. ‘‘బయటి నుంచి ఆపద తలెత్తిన సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలబడింది. కానీ ప్రధాని మోడీ మాత్రం ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు.

ఐదేండ్ల పాలనలో దేశమంతటా అభద్రతా భావం పెరిగిపోయింది. బీజేపీ నుంచి ఎప్పుడే ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుందోనని మహిళలు, విద్యార్థులు, విద్యావేత్తలు, రచయితలు, వ్యాపార వర్గాలు భయపడుతున్నాయి. రాజ్యంగ వ్యవస్థల్ ని నిర్వీర్యం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రక్షణ లేకుండాపోయింది. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే మోడీ, ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు దేశభక్తిపై ప్రధాని, బీజేపీ నేతలు ప్రశ్నలు వేస్తున్నారు. మోడీ పాలనలో విధ్వం సమైన ఆర్థిక, సామాజిక వ్యవస్థల్ని తిరిగి నిలబెట్టగల సత్తా కాంగ్రెస్​కు మాత్రమే ఉంది. మమ్మల్ని గెలిపిస్తే కూలిన ఆర్థిక వ్యవస్థను సరిచేసి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సామాజిక న్యాయాన్ని, సామరస్యాన్ని కాపాడుతాం’’అని తెలిపింది.

గాంధీ, పటేల్‌ కు కాంగ్రెస్ నివాళి..

58 ఏండ్ల తర్వాత గుజరాత్‌ గడ్డపై సీడబ్ల్ యూసీ సమావేశం నిర్వహించిన కాంగ్రెస్‌, జాతిపిత మహాత్మా గాంధీ, ఉక్కుమనిషి సర్దార్‌ పటేల్‌ కు నివాళులు అర్పించింది. బ్రిటీష్ పాలకులను దేశంలో నుంచి తరిమికొట్టేం దుకు బాపూజీ 1930 మార్చి 12న సబర్మతీ ఆశ్రమం నుంచి ఉప్పు సత్యాగ్రహం(దండి మార్చ్) ప్రారంభించారు. స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఈ ఉద్యమానికి గుర్తుగా ఏటా మార్చి 12న సబర్మతీ ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఏడాది జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు . అహ్మదాబాద్‌ సీడబ్ల్ యూసీ, గాంధీనగర్‌ బహిరంగ సభల్లో పాల్గొన్న కాంగ్రెస్‌ ప్రముఖుల్లో మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోని, గులాం నబీ ఆజాద్, అహ్మద్​ పటేల్, అశోక్​గెహ్లాట్, భూపేశ్​బాఘెల్, వి నారాయణసామి, సిద్ధరామయ్య, తరుణ్ గగోయ్, హరీశ్​రావత్, ఉమెన్​చాందీ తదితరులున్నారు.

ఉద్యోగ కల్పనలో మోడీ విఫలం:

రాహుల్ ఉద్యోగ కల్పనలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విమర్శించారు. దీని పై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. గాంధీనగర్‌ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, గుజరాత్​తో పాటు దేశమంతా కాంగ్రెస్​పార్టీకే అనుకూలత ఉందన్నారు. రాఫెల్​యుద్ధ విమానాల కొనుగోలులో మోడీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొనుగోలు ధర పెంచి తన స్నేహితుడు అనిల్​అంబానీకి 30 వేల కోట్లను అప్పనంగా దోచి పెట్టాడని మండిపడ్డారు. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ ను నోటితో పొగుడుతూనే మోడీ ఐఏఎఫ్​ సొమ్ము కాజేశాడన్నారు. కాగితపు విమానాలు కూడా చేయలేని అనిల్​అంబానీకి యుద్ధ విమానాల తయారీ కాంట్రాక్టు ఎలా ఇస్తారని మండిపడ్డారు. మోడీ కోరిక మేరకే తాము రాఫెల్​డీల్​లో అనిల్​ అంబానీని తీసుకున్నట్లు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చెప్పిన విషయాన్నీ రాహుల్ గుర్తు చేశారు.

యూపీఏ చైర్‌‌పర్సన్‌‌ సోనియాగాంధీ…

జాతి ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయం చేస్తున్నారు. తానేదో బాధితుడిలా చూపించుకుంటూ సానుభూతి పొందాలని అనుకుంటున్నారు. కానీ ఆయన తప్పుడు పాలసీల వల్ల దేశ ప్రజలంతా బాధితులయ్యారు. గత యూపీఏ సర్కారు ఎన్నో అద్భుతాలు చేసింది. ఎంతో సాధించింది. దేశానికి కొత్త దిశను చూపించాల్సిన అవసరం ఉంది.

మాజీ ప్రధాని మన్మోహన్‌‌సింగ్‌‌జాతి…
ప్రస్తుత నరేంద్ర మోడీ సర్కారు హయాంలో వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పారిశ్రామిక వృద్ధి ఆగిపోయింది. నిరుద్యోగం పెరిగింది. మళ్లీ కాంగ్రెస్‌‌ అధికారంలోకి వస్తేనే పరిస్థితులు చక్కబడతాయి.

Latest Updates