ఓటు విషయంలో పల్లెల్లో చైతన్యం, పట్నాల్లో బద్ధకం

Election awareness programs in Cities
  • న‌గ‌రాల్లో ఓటేసేందుకు ఆస‌క్తి చూప‌ని ఓట‌ర్లు
  • గ్రామాల్లోనే ఎక్కువ శాతం పోలింగ్
  • 2014లో ఖమ్మంలో అత్యధికంగా 82.55 శాతం
  • అత్యల్పంగా మల్కాజ్ గిరిలో 51.05 శాతం ఓటింగ్​
  • గిరిజన ప్రాంతాల్లో పెరుగుతున్న ఓటింగ్‌

ఎన్నికలు వచ్చాయంటే చాలు ఎక్కడ చూసినా హడావుడి. పోలింగ్ రోజైతే అంతా పోలింగ్ స్టేషన్ల వైపు బారులు తీరుతారు. పల్లెల్లో అయితే ఎన్నికల సమయం జాతరలా ఉంటుంది. అంతా ఓటు వేయడానికి తరలి వెళుతుంటారు. అటు పట్టణాల్లో ఎన్నికల హడావుడి కనిపించినా.. ఓటేసే సమయానికి పరిస్థితి మారిపోతోంది.  పోలింగ్ కేంద్రాలు బోసిపోతున్నా యి. సగం మందికి వరకు ఓటేయడానికి రావడం లేదు. 2014 లోక్‌ సభ పోలింగ్‌‌ను  పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు, ఇతర పనుల బిజీగా గడుపుతుండటంతో ఓటేయడంపై ఆసక్తి చూపించడంలేదన్న అభిప్రాయం  ఉంది. దీనికి తోడు మరెన్నోకారణాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ ఓటు ప్రాధాన్యతపై ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  పత్రికలు, చానెళ్లు,సోషల్ మీడియాలోనూ ప్రచారం చేపట్టింది.

హైదరాబాద్ లో చాలా తక్కువ

2014లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని17 స్థానాల్లో 12 చోట్ల 70 శాతంకంటే ఎక్కువపోలింగ్‌‌ నమోదైంది. అందులో మూడు చోట్ల 80శాతం కంటే అధికంగా ఓటింగ్ జరిగిం ది. అత్య-ధికంగా 82.55 శాతం పోలింగ్‌‌తో ఖమ్మం లోక్​సభ స్థానం రాష్ట్రంలో టాప్ గా నిలిచిం ది. ఇక్కడమొత్తం 14,40,267 మంది ఓటర్లు ఉండగా,11,88,875 ఓట్లు పోలయ్యాయి. దాని తర్వాత భు-వనగిరిలో 81.27 శాతం ఓటింగ్ రికార్డైంది. ఇక్కడ14,92,240 మంది ఓటర్లు ఉండగా, 12,12,738ఓట్లు పోలయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోపోలింగ్ తక్కువగా నమోదైంది. రాష్ట్రంలో నే అత్య-ల్పం గా మల్కాజ్ గిరిలో 51.05 శాతం ఓటింగ్జరిగిం ది. ఇక్కడ 31,83,083 మం ది ఓటర్లుఉండగా.. 16,24,859 ఓట్లు పడ్డాయి. తర్వాతసికిం ద్రాబాద్‌ లోక్​సభ స్థానంలో 53.06 శాతం,హైదరాబాద్‌ లో 53.30 శాతం పోలింగ్ జరిగింది.

ఎందుకు తక్కువ?

గ్రేటర్​ హైదరాబాద్​ సహా వివిధ పట్టణ ప్రాంతాల్లో ఉండేవారిలో.. ఇతర ప్రాంతాలు, గ్రామాల నుంచి వలస వచ్చేవారు ఎక్కువ. వారికి ఇక్కడి రాజకీయాలపై ఆసక్తి లేకపోవడం, ఉరుకులు, పరుగుల జీవితంలో పోలింగ్ రోజున సెలవును ఏదో ఒక పనికి వాడుకుందామన్న ఆలోచన వంటివి ఓటింగ్ తగ్గడానికి ఓ కారణం. గ్రామాల్లోని వారు ఒకరికొకరు కలుస్తూ, ఓటింగ్ కు వెళుతుంటారు. ఓటేయకపోతే ఎలా అన్న ఓ రకమైన ఉద్వేగం కూడా వారిలోఉంటుంది. పట్టణాల్లో అలాంటి పరిస్థితి కనిపించదు. ఇక పట్టణాల్లోని వారు ఎక్కువగా ఉద్యోగాల్లో ఉండటం, పోలింగ్ రోజున ఇచ్చే సెలవును పిక్ నిక్​గా,హాలిడేలా ఎంజాయ్ చేద్దామనుకోవడం వల్ల కూడా పోలింగ్ తగ్గడానికి కారణమవుతోంది. ధనికులు,వ్యాపార వర్గాల వారు పోలింగ్ సెంటర్​కు వచ్చి, క్యూలో నిలబడి ఓటేయడానికి పెద్దగా ఇష్టపడరు. దీనికి తోడు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అయితే వివిధ కారణాలతో ఇళ్లు మారేవారు.. కొత్త చోటికి ఓటర్​ కార్డులను మార్చు కోకపోవడం, పాత ప్రాంతానికి వెళ్లి ఓటేయడానికి ఇబ్బందులు వంటివి కూడా ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతున్నాయి.

గిరిజన ప్రాంతాల్లో పెంపు..

సాధారణ ప్రాంతాల కంటే గిరిజనులు అధికంగా ఉన్న చోట ఎక్కువ శాతం పోలింగ్‌‌ నమోదైంది. రిజర్వ్‌‌డ్‌ స్థానాల్లో గతంలోనూ ఎక్కువగా ఓటింగ్ జరగ్గా..ఈసారి మరిం త పెరిగింది. ఏజెన్సీ ఏరియాల్లో ఉండే ఓటర్లలో అక్షరాస్యత శాతం కూడా తక్కువే ఉంటుంది. అయినా వారు ఎక్కువగా ఓటేయడానికి తరలి వస్తున్నారు.గత ఎన్నికల్లో మహబూబాబాద్‌ సీటులో 81.21శాతం పోలింగ్‌‌ నమోదై.. రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ 13,87,288 మంది ఓటర్లు ఉండగా,11,26,618 ఓట్లు పోలయ్యాయి. మరోఎస్టీ  స్థానం ఆదిలాబాద్‌ లో 76.15 శాతం పోలింగ్‌‌ జరిగింది. ఇక్కడ 13,86,282 మంది ఓటర్లకుగాను 10,55,593 ఓట్లుపోలయ్యాయి.  ఓటు వినియోగిం చుకోపోతే వారు  చనిపోయినట్టుగా భావిస్తారని  పలుఏజెన్సీ ప్రాంతాల్లో నమ్ముతారని, అందుకే పోలింగ్ కు తరలివస్తారని అక్కడి వారు చెబుతున్నా రు. ఇక ఎస్సీ రిజర్వ్‌‌డ్‌ స్థానాల్లోనూ పోలింగ్‌‌ కొంత మెరుగ్గానే  ఉంది. వరంగల్‌‌లో 76.52%, నాగర్‌ కర్నూల్‌‌లో 75.5%, పెద్దపల్లిలో 71.93% చొప్పున పోలింగ్‌‌ నమోదైంది.

ఓటుపై చైతన్యం కల్పిస్తున్నా..

గతంలో తక్కువ పోలింగ్‌‌ నమోదైన ప్రాంతాలపై ఎన్నికల అధికారులు ఈసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోతక్కువ ఓటింగ్‌‌ నమోదవడంతో.. ఆయాప్రాంతాల్లో ఎన్నికల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు.  ఐటీ రంగం సహా వివిధ కంపెనీల్లో యజమాన్యా లతో కలిసి స్పెషల్‌‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. కుల,ప్రజా సంఘాలు, కళాకారులు, యువత,స్వచ్ఛంద సంస్థల సహాయం కూడా తీసుకుంటున్నా రు. ర్యాలీలు, సభలు, సమావేశాలు,సదస్సులు, ప్రదర్శనలు, పవర్‌ పాయిం ట్‌ ప్రజెం టేషన్లు, మీడియా, సోషల్ మీడియాలల్లో ఓటు ప్రాధాన్యం పై ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా ఓటింగ్ శాతం ఎంత మేరపెరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు.

Latest Updates