ఇవాళ మహబూబాబాద్, ఖమ్మంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం

సీఎం కేసీఆర్ ఇవాళ (గురువారం) మహబూబాబాద్, ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇల్లందు రోడ్డు మైదానంలో జరగనున్న సభలో కేసీఆర్ మాట్లాడనున్నారు. 50 ఎకరాల గ్రౌండ్ లో సభా వేదిక, హెలిప్యాడ్ రెడీ చేశారు జిల్లా నేతలు. సభకు లక్షన్నర మంది హాజరవుతారని  అంచనా వేస్తున్నారు గులాబీ నేతలు. సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి.

మహబూబాబాద్ మీటింగ్ తర్వాత ఖమ్మం చేరుకోనున్నారు కేసీఆర్.  జిల్లా కేంద్రంలో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 5.30 గంటలకు SR  అండ్ BGNR  డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడనున్నారు సీఎం. ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుకు మద్దతుతో పాటు మాజీ మంత్రి తుమ్మల, జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Latest Updates