యూపీలో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడుతున్న ప్రతిపక్షాలు

election campaign of opposition parties in UP
  • యూపీలో పార్టీల ముందుచూపు
  • కొన్నిచోట్ల దోస్తీ పోటీ
  • ఇంకొన్నిచోట్ల పోటీకే దూరం
  • కాంగ్రెస్, కూటమి మధ్య సర్దుబాట్లు

ఉత్తరప్రదేశ్ లో బీజేపీయేతర పార్టీ లో బయటికి వెల్లడించని ఒప్పందం ఒకటి కొనసాగుతోంది. నువ్వక్కడ.. నేనిక్కడ తరహాలో లోక్ సభ సీట్లను నేతలు పంచేసుకుంటున్నారు. ఫలితాల్లో ఎవరికీ మెజారిటీ రాకుంటే కలిసి నడిచేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నచోట ఎస్పీ, బీఎస్పీ కూటమి వెనక్కు తగ్గుతోంది, ఎస్పీ, బీఎస్పీ కూటమి బలంగా ఉన్నచోట కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోంది. ఓట్లు చీలకుం డా చూసుకుంటూ సదరు నియోజకవర్గం లో తమ అభ్యర్థిని నిలబెట్టడంలేదు. తప్పనిసరిగా పెట్టాల్సి వచ్చినా.. నామ్ కేవాస్తే ఓ అభ్యర్థిని బరిలోకి దింపుతున్నా రు.

యూపీఏ కన్వీనర్, కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ నియోజకవర్గం రాయ్ బరేలీలో ఎస్పీ, బీఎస్పీ,ఆర్ ఎల్డీ కూటమి పోటీచేయడం లేదు. రాహుల్ గాంధీ సిట్టింగ్ స్థానం అమేథీలోనూ పోటీకి దూరంగా ఉంది. దీనికి ప్రతిగా ఎస్పీ నేతలు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు పోటీచేస్తున్న మెయిన్ పురి,కనౌజ్, అజాం గఢ్ లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. ఒక్క బదాయున్ సీటుకు మాత్రమే మినహాయింపునిచ్చా రు. అదెలాగూ ఎస్పీ కంచుకోటే కాబట్టి మినహాయించారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ సీనియర్ నేతలకు వ్యతిరేకంగా తమ అభ్యర్థులను నిలబెట్టకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.

కొన్నిచోట్ల గట్టి పోటీ..

పార్టీ ముఖ్యులు బరిలో ఉన్నచోట పరస్పర అవగాహనతో పోటీ నుం చి తప్పుకున్న పార్టీలు కొన్నిప్రాంతాల్లో నువ్వా.. నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. పశ్చిమ యూపీలోని మొరాదాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాం గ్రెస్ తరఫున బరిలో దిగిన ఇమ్రాన్ ప్రతాప్ గఢీకి ఎస్పీ అభ్యర్థి ఎస్టీ హసన్ గట్టి పోటీనివ్వనున్నారు. రాం పూర్ లో జయప్రదకు పోటీగా ఎస్పీ నేత ఆజంఖాన్ నిల్చో గా,కాంగ్రెస్ పార్టీ స్థాని క ఎమ్మెల్యే సంజీవ్ కపూర్ ను నిలబెట్టింది. కాన్పూర్ లోకాం గ్రెస్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జైస్వాల్ పోటీ చేస్తున్నారు.దీంతో ఎస్పీ నిషాద్ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఉన్నావ్ లో బీజేపీ అభ్యర్థి సాక్షి మహరాజ్ కు గట్టి-పోటీనిచ్చేం దుకు అనుటాండన్ కు కాంగ్రెస్ సీటిచ్చిం ది. ఈ ఎన్నికల్లో ఓబీసీలను తమవైపు తిప్పుకునేం దుకు కాం గ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో ఓబీసీలకు టికెట్లిచ్చిం ది. ఆయా కమ్యూనిటీలను పార్టీ వైపునకు తిప్పుకోవడంతో పాటు బీజేపీని దెబ్బతీయడమే కాం గ్రెస్ ఉద్దేశమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాటు గోండా, బదోహి, సీతాపూర్ తదితర స్థానాల్లో నూ అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు వెనక పార్టీలు పరస్పర ప్రయోజనాలను కాపాడుకోవడం, ఉమ్మడిగా లాభపడడమనే కాన్సెప్ట్​ను ఫాలో అయ్యాయని అంటున్నారు.

Latest Updates