కరోనా టెస్టులు చేయించుకున్న తర్వాతే  ప్రచారం చేయాలి

హైకోర్టు లో న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్..

హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేసే వారు ముందుగా కరోనా టెస్టులు చేయించుకుని.. నెగటివ్ గా నిర్ధారణ అయిన తర్వాతే ప్రచారంలో పాల్గొనేలా చూడాలంటూ హైకోర్టులో న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసుకోవాలి.. ఆ తర్వాతే  ప్రచారం చేయాలి.. అని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని..  టెస్టుల అనంతరమే అభ్యర్థులు ప్రచారం చేసేలా చూడాలని ఆయన హైకోర్టు లో రిట్ పిటిషన్ లో కోరారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులతో పాటు ప్రచారం చేసే వారందరూ కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని.. లేనిపక్షంలో భారీగా కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించి.. ఎన్నికలు నిర్వహించే విధంగా పోలీసు అధికారులు, వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆయన కోరారు.

Read More News…

టామ్ అండ్ జెర్రీ మళ్లీ వచ్చేశారు.. అలరిస్తున్న ట్రైలర్

మొబైల్ డేటా వినియోగించాడంటూ తమ్ముడిని హత్య చేసిన అన్న

రీసెర్చ్ : అమ్మాయిలకు బట్టతల మన్మథులంటేనే ఇష్టం

Latest Updates