ఎన్నికల కోడ్: హైదరాబాద్ లో బ్యానర్లు,పోస్టర్లు తొలగింపు

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా హైద రాబాద్ జిల్లాలో వివిధ పార్టీల ప్రచారాల కు సంబంధించి అనుమ తు లు లేని హోర్డింగ్‌‌లు, బ్యానర్లు , పోస్టర్ల తొల గింపు ప్రక్రియను జీహెచ్ఎంసీ కొన సాగిస్తోంది.ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు అవుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 22,758 బ్యానర్లు , పోస్టర్లు , వాల్ రైటింగ్‌‌లను తొలగించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దాన కిశోర్ తెలిపారు. జీహెచ్ఎంసీకి చెందిన ఎన్‌ ఫోర్స్‌‌మెంట్‌‌, డి జాస్టర్ మేనేజ్‌ మెం ట్ బృందాలు, జీహెచ్ఎంసీ శానిటేష న్ సిబ్బంది న గ రంలో పార్టీల బ్యానర్లు , పోస్టర్లను తొలగించాయి. మారుమూల ప్రాంతాలు, బస్తీల్ లో బ్యానర్లు , పోస్టర్లను ఎక్కువగా గుర్తించి,తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల పై 4,964 పోస్టర్లు , 4,145 బ్యానర్లు , 4,465 ఇతర ప్రచార సామాగ్రి, 737 వాల్ రైటింగ్‌‌ల ను తొల గించినట్టు దాన కిశోర్ వెల్లడించారు.ప్రైవేట్ భవనాలు, ఆస్తుల పై 8,447 పోస్టర్లు , బ్యానర్లు , వాల్ రైటింగ్‌‌ల ను తొల గించినట్లు తెలిపారు. నగరంలోని ప్రభుత్వ భవనం, క్యాంపస్ లలో రాజకీయ పార్టీల ప్రకటనలు, వాల్ రైటింగ్‌‌లు, పోస్టర్లు , కటౌట్ల ప్రదర్శన పూర్తిగాని షేధించినట్టు కమిషనర్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాల నియంత్రణ , బెల్ట్ షాపుల మూసివేతపై జిల్లా ఎన్నికల అధికారి దాన కిశోర్ ఎక్సైజ్ అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. జిల్లాలో గతేడాది ఏప్రిల్‌‌1 నా టికి రిటైల్ మద్యం అమ్మకందారుల వద్ద 12,94,580 ఐఎంల్ బాటిళ్ల స్టాక్  ఉండగా సోమవారం ఏప్రిల్1వ తే దీన 10,90,052 బాటిళ్ల స్టాక్ ఉందని ఎక్సైజ్ అధికారులు వివరించారు. నగరంలోఇప్పటి వరకు 51 బెల్ట్ షాపులు మూసివేశామని , 2,912 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.

Latest Updates