సిద్దూకు ఎన్నికల సంఘం క్లీన్‌ చిట్‌

election-commission-clean-chit-for-sidhu

పంజాబ్ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. సిద్ధూ ఇటీవల మధ్యప్రదేశ్‌లోఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇందుకు సంబంధించిన అంశపై ఎన్నికల సంఘం సిద్దూకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

ఇండోర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధూ మాట్లాడుతూ, పని తక్కువ మాటలు ఎక్కువ అనే రీతితో మోడీని ఉద్దేశించి విమర్శించారు. తక్కువ చపాతీలు చేసే పెళ్లికూతురు తన గాజుల మోతతో ఎక్కువ పని చేస్తుందనే భ్రమ కల్పించినట్టు మోడీ పనితీరు ఉందని అన్నారు. గాజుల చప్పుడు ఎక్కువుంటే వీధిలో వాళ్లంతా ఆ వధువు బాగానే పనిచేస్తుందన్న అభిప్రాయానికి వస్తారని సిద్దూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. దీన్ని పరిశీలించిన ఇండోర్ ఎన్నికల కార్యాలయం సిద్ధూకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిద్ధూ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని తెలిపింది.

Latest Updates