ఎన్నికల బరిలో 185 మంది: నిజామాబాద్‌ పై ఈసీదే నిర్ణయం

నిజామాబాద్ లోక్ సభ స్థా నంలో 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో) ఇచ్చే నివేదికను ఈసీదృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పోలింగ్ ను ఈవీఎంలతో జరపాలా.. పేపర్ బ్యాలెట్ తో జరపాలా అన్నదానిపై ఈసీ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. లోక్ సభ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 17 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ లో పోలింగ్ వాయిదా పడుతుందా అని ప్రశ్నించగా.. దానిపై తాను మాట్లాడబోనని పేర్కొన్నారు. ‘‘15 మందికి మించి అభ్యర్థులున్న చోట్ల రెండు బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తాం. నిజామాబాద్ లో 185 మంది అభ్యర్థులు ఉన్నందున పేపర్ బ్యాలెట్ అవకాశాలను పరిశీలిస్తున్నాం. నిజామాబాద్ డీఈవో శుక్రవారం ఉదయం 11 గంటలకు రిపోర్టు తీసుకుని హైదరాబాద్ వస్తారు. దాన్ని పరిశీలించి ఈసీకి నివేదిస్తాం. అక్కడ్నుంచి ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తాం ’’ అని వివరిం చారు.

5 రోజుల్లో పేపర్ బ్యాలెట్ రెడీ
నిజామాబాద్ ఎన్నికకు పేపర్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరపాల్సి వస్తే ఐదు రోజుల్లో బ్యాలెట్ రెడీ చేస్తామని సీఈవో చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ తెలుపు రంగులో ఉంటుందని, ఈసీ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం పేపర్ సైజ్ ఖరారవుతుందని వివరించారు. దాన్ని బట్టి బ్యాలెట్ ప్రింటింగ్ డిజైన్ వస్తుందని, తర్వాత బ్యాలెట్ పేపర్ ముద్రణకు ఆదేశాలిస్తామని చెప్పారు.

సింబల్స్ కు కొదవ లేదు
అభ్యర్థులకు సింబల్స్ కేటాయింపులో ఇబ్బందేమీ లేదని, ఎంతమంది ఉన్నా గుర్తులు కేటాయిస్తామని రజత్ కుమార్ చెప్పారు. ‘‘నిజామాబాద్ ఎన్నికకు అడిషనల్ స్టాఫ్ అవసరం ఉంటుంది. పోలింగ్ స్టేషన్ లోపల ఉండే సిబ్బంది సంఖ్యలో ఎలాంటి తేడా ఉండదు. పోలింగ్ స్టేషన్ బయట ఎక్కువ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద మోడల్ బ్యాలెట్ పేపర్ ఏర్పాటు, పోలింగ్ ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా షామియానాలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. మొత్తం 93సింబల్స్ ఉన్నాయి. వాటిల్లో జాతీయ పార్టీలు, రాష్ట్రపార్టీలకు 10 సింబల్స్ రిజర్వుగా ఉన్నాయి. మినహా మిగతా 83 సింబల్స్ ముందుగా గుర్తింపు పొందిన పార్టీలకు ఇస్తాం. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తాం . ఈసీ గుర్తిం చిన 198 ఫ్రీ సింబల్స్ కూడాఅందుబాటులో ఉన్నాయి’’ అని వివరించారు.

 

టీఆర్ఎస్ కు నోటీసులిచ్చాం

సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతిభవన్ లోరాజకీయ కార్యకలాపాలపై టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీకి నోటీసు ఇచ్చామని, దానిపై ఇప్పటి వరకు సమాధానం రాలేదని సీఈవో రజత్ కుమార్ తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ మంచిర్యాల రైతుతో ఫోన్ లో మాట్లాడిన అంశంపై కూడాఫిర్యాదు అందిందని, దానిపై విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. ‘‘ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉంది.సీఎం ఎవరితోనైనా మాట్లాడవచ్చు. కానీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించే చర్యలకు పాల్పడరాదు. కేసీఆర్ పైతీసిన సినిమాపైనా ఫిర్యాదు అందింది. దాన్ని పరిశీలిస్తున్నం ’’ అని అన్నారు .

ఎస్ఎంఎస్ లపై ఫిర్యాదు చేయండి
పోలింగ్ కు ముందు 48 గంటల్లో ఎన్నికలకు సంబంధించి ప్రచారాంశాలు, అభ్యం తరకరసందేశాలు ( ఎస్ ఎంఎస్ )లపై ఫిర్యాదు చేయాలని సీఈవో సూచించారు. ఇందుకు డీజీపీ ఆఫీసులో ప్రత్యేకంగా 9490617523 నెంబరును ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

రూ.18 కోట్ల నగదు సీజ్
గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.18.07 కోట్ల నగదు సీజ్ చేసినట్లు సీఈవో చెప్పారు. మొత్తంగారూ.23.38 కోట్ల విలువైన లిక్కర్ , నార్కోటిక్స్ ఇతరవస్తువులు పట్టుకున్నట్లు తెలిపారు.

Latest Updates